India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెద్దపంజాని మండలం బసవరాజుకండ్రిగ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన MCA విద్యార్థి సాయి కిరణ్ (23) బైక్‌పై వెళుతుండగా పలమనేరు-పుంగనూరు జాతీయ రహదారి వద్ద ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో సాయికిరణ్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.

ఆచంట MLA పితాని సత్యనారాయణ సోదరుడు, ప్రముఖ లేసు వ్యాపారి పితాని సూర్య నారాయణ (78) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఈయన స్వగ్రామం పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామం కాగా పెనుగొండ డిగ్రీ కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్‌గా కొనసాగుతున్నారు. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల మాజీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామ్మోహన్, గుబ్బల తమ్మయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశంలో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని జిల్లా సమస్యలపై ప్రస్తావించారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు పలువురు రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

పల్నాడు (D) మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల (D) డోన్‌కు చెందిన విద్యార్థిని జక్కి రేణుక ఎల్లమ్మ మాచర్లలోని హాస్టల్ రూమ్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో నిన్న ఉదయం రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు సైతం హాజరయ్యారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు హాజరయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి పైన వీరికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

రాజధాని పరిధిలో ప్రతి సెంటు భూమి సమీకరణ లేదా సేకరణ విధానంలో తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామాలు, గ్రామకంఠాల కిందనున్న భూమి తప్ప మిగిలినదంతా తీసుకోనుంది. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని CRDA వర్గాలు స్పష్టంచేశాయి. భవనాలను CRDA స్వాధీనం చేసుకునే అవకాశముంది. భూములపై కోర్టు స్టేలు ఉంటే వాటిని వెకేట్ చేయించి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఇంకా 4,181 ఎకరాలు తీసుకోవాల్సి ఉంది.

అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి పారిస్‌లో ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. షాట్‌పుట్‌లో రవి భారత్‌కు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. అతణ్ని క్రీడాకారుడిగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం విక్రయించారు. ఆదాయపు పన్ను విభాగంలో అధికారిగా పనిచేస్తున్న రవి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని అన్నారు.

మంత్రాలయం మండలం లక్ష్మరి గ్రామ సమీపంలో ఉన్న మోడల్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని పార్వతి పాఠశాల గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. సుంకేశ్వరి గ్రామానికి చెందిన చిన్న చిన్నప్ప మనుమరాలు పార్వతి. తల్లిదండ్రులు పనుల నిమిత్తం హైదరాబాద్‌లో వెళ్లారు. విద్యార్థిని తాతయ్య దగ్గర చదువుకుంటోంది. ఘటనా స్థలానికి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేసేందుకు దిగి తణుకు పట్టణానికి చెందిన కొల్లి జాన్‌బాబు (17) సముద్రంలో ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా నిన్న రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సోమవారం (నేడు) మళ్లీ పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలించింది. ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా విజయనగరం జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
Sorry, no posts matched your criteria.