India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మే 13న ఓట్లు వేసేందుకు జిల్లాలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీటి వసతి, వికలాంగులకు వీల్ ఛైర్లను ఏర్పాటు చేశామన్నారు. శనివారం సాయంకాలం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చునని వెల్లడించారు.

ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కేంద్రాలు మూసివేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎన్వీ రమణ తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మూతపడతాయన్నారు. అనధికార మద్యం విక్రయాలు చేసినా.. నిల్వలు చేసినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

2024 ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. మరికొన్ని గంటలే ఉండటంతో నాయకులు సమయం లేదు మిత్రమా అంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఫోన్లు, ప్రకటనలు, ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నాయకులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రావెల్ ఛార్జులు కూడా నాయకులే ఇస్తుండటం గమనార్హం.

2024 ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. మరికొన్ని గంటలే ఉండటంతో నాయకులు సమయం లేదు మిత్రమా అంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఫోన్లు, ప్రకటనలు, ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నాయకులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రావెల్ ఛార్జులు కూడా నాయకులే ఇస్తుండటం గమనార్హం.

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు మరో 2 రోజులు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధన ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాలి. శనివారం సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోపాటు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ముమ్మర ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మనజీ జిలానీ సమూన్ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం మద్దిలోడు పేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలో శుక్రవారం రాత్రి టీడీపీ-వైసీపీకి చెందిన ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం పీఇఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కుప్పం డి.ఎస్.పి శ్రీనాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్తు సరఫరా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి జిల్లాల ఎస్ఈ కృష్ణా
రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన విద్యుత్తు సరఫరాపై ఆరాతీశారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని విద్యుత్తు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాల వద్ద సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే 9440817412కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటితో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంగోలు, దర్శి నియోజకవర్గాల్లో రూ.3వేలు ఇస్తున్నట్లు సమాచారం. గిద్దలూరు, మార్కాపురం, చీరాల, అద్దంకి 2000 ఇస్తున్నారట. కాగా కొండపి, కనిగిరి, వై.పాలెంలో ఓటుకు 1500-2000 ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అటు ఇలాంటివి కట్టడి చేసేందుకు ఈసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
Sorry, no posts matched your criteria.