Andhra Pradesh

News August 5, 2024

నీట్ ఫలితాల్లో మెరిసిన ముదిగుబ్బ విద్యార్థి

image

ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్ నాయక్ కుమారుడు గణేశ్ నాయక్ నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలను నిన్న డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని విద్యార్థి గణేశ్ నాయక్ తెలిపారు.

News August 5, 2024

నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా

image

సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. గ్రామాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందిని తొలగిస్తున్నారని నియోజకవర్గాలలో 700 మందిని ఇప్పటికే తొలగించినట్లు పేర్కొన్నారు. తొలగించిన సిబ్బందిని వెంటనే తిరిగి చేర్చుకోవాలని లేకుంటే నియోజకవర్గాల వారీగా పార్టీ తరఫున ప్రతి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

News August 5, 2024

CM సమావేశంలో పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్

image

రాజధాని అమరావతి సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. పలు అంశాలపై సీఎం కలెక్టర్లకు సూచనలు చేశారు.

News August 5, 2024

ఏలూరు: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. మంత్రి సీరియస్

image

ఏలూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. నూజివీడు రూరల్ మండలానికి చెందిన ఐదేళ్ల చిన్నారిని గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేశారు. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న చిన్నారిని సమీపంలోని పామాయిల్ తోటలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయారు. బాలికను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుణ్ని అరెస్ట్ చేసి శిక్షించాలని ఆదేశించారు.

News August 5, 2024

అవినీతిని ప్రక్షాళన చేయండి: మంత్రి ఆనం

image

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మొదటిసారి జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆనం మాట్లాడుతూ.. దేవాదాయ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేయాలని ఆయన తెలిపారు.

News August 5, 2024

సీఎంతో సమావేశమైన మంత్రులు, కలెక్టర్లు

image

సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు సైతం హాజరయ్యారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు హాజరయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి పైన వీరికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

News August 5, 2024

మధురవాడలో మరో కొత్త యూనిట్ మాల్

image

విశాఖలోని మధురవాడ ప్రాంతంలో మరో కొత్త యూనిట్ మాల్ ఏర్పాటు కానుంది. రామానాయుడు స్టూడియో వద్ద ఈ మాల్‌ను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్, రూరల్ ఎమ్మార్వో పాల్ కిరణ్ సోమవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అంశాలపై అధికారులతో ఆరా తీశారు.

News August 5, 2024

గుడివాడ: కాలువలో పడి యువకుడి మృతి

image

గుడివాడలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బండి ప్రేమ్ కుమార్ (26) సోమవారం పెద్ద కాలువలో పడి బైక్ మెకానిక్ మృతి చెందాడు. అతను ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రేమ్ కుమార్ మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News August 5, 2024

పెద్దపంజాని: రోడ్డు ప్రమాదంలో MCA విద్యార్థి మృతి

image

పెద్దపంజాని మండలం బసవరాజుకండ్రిగ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన MCA విద్యార్థి సాయి కిరణ్ (23) బైక్‌పై  వెళుతుండగా పలమనేరు-పుంగనూరు జాతీయ రహదారి వద్ద ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో సాయికిరణ్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.   

News August 5, 2024

ప.గో.: MLA సోదరుడు గుండెపోటుతో మృతి

image

ఆచంట MLA పితాని సత్యనారాయణ సోదరుడు, ప్రముఖ లేసు వ్యాపారి పితాని సూర్య నారాయణ (78) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఈయన స్వగ్రామం పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామం కాగా పెనుగొండ డిగ్రీ కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్‌గా కొనసాగుతున్నారు. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల మాజీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామ్మోహన్, గుబ్బల తమ్మయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.