Andhra Pradesh

News August 8, 2024

ప్రొద్దుటూరు: ఇటుకలు మీదపడి బేల్దారి మృతి

image

ప్రొద్దుటూరు మౌలానా ఆజాద్ వీధిలో ఇంటి నిర్మాణ పని జరుగుతుండగా ఇటుకలు మీద పడటంతో బేల్దారి పల్లా విశ్వనాథ్ (46) మృతి చెందాడు. బుధవారం మౌలానా ఆజాద్ వీధిలో నూతన ఇంటి నిర్మాణ పనులకు విశ్వనాథ్ వెళ్లాడు. యంత్రం సహాయంతో కింద ఉన్న ఇటుకలను భవనం పైకి చేర్చే క్రమంలో ప్రమాదవశాత్తు కొన్ని ఇటుకలు జారి విశ్వనాథ్‌పై పడ్డాయి. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు.

News August 8, 2024

ముమ్మిడివరం: ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు 

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేసి, మోసం చేశాడంటూ యువతి ముమ్మిడివరంలో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ జ్వాలాముఖి ప్రకారం.. భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటున్న ఓ యువతిని కమిని గ్రామ పరిధిలోని వాసాలతిప్పకు చెందిన రామకృష్ణ ప్రేమ పేరుతో మోసం చేశాడు. మే నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

News August 8, 2024

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలల నూతన కమిటీ ఎన్నికలు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 1830, ప్రాథమికోన్నత పాఠశాలలు 213, ఉన్నత పాఠశాలలు 298, మొత్తం 2341 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలకు నేటి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించటానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులే ఓటర్లుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు DEO తెలిపారు.

News August 8, 2024

చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే మృతి

image

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్‌రావు గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చీపురుపల్లిలోని లావేరు రోడ్డు‌లోని ఆయన ఇంటికి మృతదేహాన్ని తీసుకురానున్నారు. కాగా ఏయూలో ఎంఏ పూర్తి చేసిన కెంబూరి..1985లో చీపురుపల్లి MLAగా, 1989లో బొబ్బిలి MPగా గెలిచారు.

News August 8, 2024

ఏలూరు: ‘భార్యను అందుకే చంపాను’

image

కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో భార్యను భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదంలో హత్య జరినట్లు DSP తెలిపారు. సూర్యచంద్రానికి 11ఏళ్ల క్రితం సాయిలక్ష్మితో పెళ్లి జరిగింది. కొన్నేళ్లుగా గొడవలు జరగడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో నిన్న వారి మధ్య వాగ్వాదం జరగగా కోపంతో సూర్యచంద్రం రోడ్డుపై ఆమె మెడపై కత్తితో నరికినట్లు తెలిపాడు.

News August 8, 2024

విశాఖ MLC ఉప ఎన్నిక: రెండో రోజూ నామినేషన్లు నిల్

image

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి బుధవారం కూడా నామపత్రాలు దాఖలు కాలేదు. ఈనెల 13 వరకు సమయం ఉంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ నాయకులు నామపత్రాలు తీసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణకు ఇప్పటికే ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. త్వరలో ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది. కాగా నేడు జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు కూటమి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

News August 8, 2024

సంక్రాంతి తర్వాత కూటమి నిజస్వరూపం: బొత్స

image

సంక్రాంతి తరువాత కూటమి నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారని ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం ఆనందపురం మండలం బోయపాలెంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.

News August 8, 2024

పొదిలి: అమ్మకు వందనం పథకం పేరుతో మోసం

image

సైబర్ మోసగాళ్లు కొత్త మోసానికి తెరలేపుతున్నారు. తాజాగా అమ్మకు వందనం పథకం పేరుతో పొదిలిలో బుధవారం ఒకరికి కుచ్చు టోపీ పెట్టారు. బాధితుడి వివరాల ప్రకారం.. పొదిలికి చెందిన రామకృష్ణకు వాలంటీర్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. తాను సచివాలయం నుంచి మాట్లాడుతున్నానని అమ్మకు వందనం పథకం డబ్బులు ఖాతాలో జమ అవ్వలేదా అని అడిగారు. తెలియదు అనగా ఫోన్ పే ఓపెన్ చేసి ఇలా చేయాలంటూ రూ.22వేలు మాయం చేశారు. కేసు నమోదైంది.

News August 8, 2024

ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సోదరి మృతి

image

డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సోదరి, ప్రముఖ సినీ నిర్మాత ఎం.శ్యాం ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మరణించారు. ఆమె మృతి పట్ల నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పలువురు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

News August 8, 2024

రైలు కిందపడి వ్యక్తి మృతి

image

గుంతకల్లు రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో గుంతకల్లు బళ్లారి సెక్షన్ బంటనహల్ రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి(40) బలవన్మరణానికి పాల్పడినట్లు రైల్వే ఏఎస్ఐ రామదాసు తెలిపారు. అతను ట్రాక్‌పై పడుకోవడంతో రైలు వెళ్లినప్పుడు శరీరం నుంచి తల వేరయిందన్నారు. ఇతని వద్ద గుంతకల్లు నుంచి హుబ్లీకి వెళ్లే రైలు టికెట్, తిరుపతి లడ్డూ కవర్ ఉన్నాయని తెలిపారు. మృతుడి పేరు, ఇతర వివరాలు తెలియరాలేదన్నారు.