India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, భద్రతపై నిత్యం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిదని కలెక్టర్ దినేష్ కుమార్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఓలు, ఏపీవోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

బుచ్చియ్యపేట మండలం విజయరామరాజుపేట సమీపంలోని బియన్ రోడ్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విస్సారపు గణేశ్, శీలం మధు బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకి తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో చోడవరం ఆసుపత్రికి తరలించారు.

ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబీకులు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోము కానీ తప్పకుండా ఓటు వేస్తాము’ అనే బ్యానర్‌ను ఇంటి గేటుకు ఏర్పాటుచేశారు. కాగా ఈ బ్యానర్ పలువురిని ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.

నంద్యాల-గాజులపల్లె మార్గంలో చలమ రేంజ్ అటవీశాఖలోని పెద్ద పులులు, ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో ప్రయాణీకులు జాగ్రత్తలు పాటించాలని చలమ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేశారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన పోలింగ్ రోజున దుకాణాలు, కార్మిక సంస్థలకు ఈసీ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లుగా జిల్లా ఉపకార్మిక కమిషనర్ శ్రీనివాస కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు వేయటానికి అర్హులైన ప్రతి ఒక్కరికి పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్మిక దుకాణాల చట్టం అనుసరించి నిబంధనలు పాటించాలన్నారు.

భీమవరంలో రేపు జరగవలసిన బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్‌షో రద్దయింది. షా బిజీ షెడ్యూల్ వల్ల ఈ కార్యక్రమం రద్దయినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

ముస్లిం మైనార్టీలకు అండగా ఎన్డీఏ కూటమి ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో రైతుల మధ్య మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు తెలిపారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా గురువారం ప.గో. జిల్లా పెదఅమిరంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ 5 నెలల కింద నగదు విడుదల చేసిన పథకాలకు డబ్బు జమ చేయాలంటూ కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
– RRR వ్యాఖ్యలపై మీరేమంటారు..?

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల సౌలభ్యం కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.17239 గుంటూరు- విశాఖపట్నం(మే 11 నుంచి 13), నం.17240 విశాఖ- గుంటూరు(మే 12 నుంచి 14) ట్రైన్‌కు ఒక ఛైర్ కార్ కోచ్ అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అదనపు బోగీ ద్వారా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి బెర్తులు లభిస్తాయన్నారు.

జిల్లాలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,340 సెంటర్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందులో యర్రగొండపాలెం నియోజకవర్గంలో 162, దర్శిలో 187, సంతనూతలపాడులో 163, ఒంగోలులో 193, కొండపిలో 168, మార్కాపురంలో 147, గిద్దలూరులో 168, కనిగిరిలో 152 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే సగానికి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరగనుంది.
Sorry, no posts matched your criteria.