India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డిసిఎం సందీప్ తెలిపారు. విశాఖ-చెన్నై ఎగ్మోర్ స్పెషల్ ట్రైన్ ప్రతి సోమవారం విశాఖలో బయలుదేరి మరుసటి రోజు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుందన్నారు. ఈనెల13 నుంచి 24 వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం చెన్నై ఎగ్మోర్ లో బయలుదేరి విశాఖ చేరుకుంటుందన్నారు.

కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్లలో 4 రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారం ముగింసింది. పోలింగ్ సిబ్బంది, పోలీసులు, వయో వృద్ధులు, వికలాంగులు.. ఇలా అందరూ కలిపి 23,612 మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోగా.. 20,733 (81.87శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ శుక్రవారం మంగళగిరికి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ప్రదేశాన్ని ఎమ్మెల్యే ఆర్కే, పోలీస్ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలం కోసం నిడమర్రు రోడ్డు, రైలుగేటు వద్ద గల స్థలాలను పరిశీలించారు.

బీసీ నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్యపై రాయితో దాడి చేశారు. శ్రీకాళహస్తి MLA మధుసూదన్ రెడ్డి, కృష్ణయ్య నిన్న రాత్రి ఏర్పేడులో రోడ్ షో నిర్వహించారు. ఈక్రమంలో ఎవరో విసిరిన రాయి ఎంపీ వీపునకు తగిలింది. అప్రమత్తమైన వైసీపీ కార్యకర్తలు ఎస్ఐ జిలానీకి ఫిర్యాదు చేశారు. తనపై బీసీలు దాడి చేయరని.. ఇది టీడీపీ కుట్రేనని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

విశాఖ జిల్లాలో దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 16,821 మందికి పైగా దివ్యాంగ ఓటర్లు ఉంటే వీరిలో 547 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. మిగిలిన 16,274 మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వేయనున్నారు. వీరి కోసం 100 వీల్ ఛైర్లు సిద్ధం చేశారు. వీరిలో 8వేల మంది అంధులు ఉన్నారు. వీరి కోసం బ్యాలెట్ పేపర్లు బ్రెయిలీ లిపిలో సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 2,358 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18,92,382 మంది ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో మే 13న పోలింగ్‌లో పాల్గొననున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, నీరు, ఫ్యాన్లు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ సిబ్బందికి అవగాహన కల్పించారు.

శ్రీకాకుళం నగర పరిధిలోని అరసవల్లి, పొట్టి శ్రీరాములు మార్కెట్, దమ్మల వీధి, గుడి వీధిలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబుకు శ్రీకాకుళంపై అభిమానం లేదన్నారు.

తిరుపతి: పోలింగ్ రోజున ఉదయం 5 గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ లేదా పక్కన ఉన్న పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ అయి ఉండాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ తప్పనిసరిగా ఎపిక్ కార్డ్ / ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా ఇతర ప్రత్యామ్నాయ పత్రాన్ని కలిగి ఉండాలని తెలిపారు.

ఉండి నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నేడు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండి ప్రధాన కూడలిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారని నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు తెలిపారు. కూటమి పార్టీల నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అటు ఏలూరులోనూ పర్యటించనున్నారు.

పోలింగ్ మే 13న జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్ జరిగే రోజుల్లో ఈనెల 12, 13 తేదీలలో పత్రికల్లో ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ఎంసిఎంసి నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.