India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజంపేట అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు 2211 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని రాజంపేట రిటర్నింగ్ అధికారి మోహన్ రావు తెలిపారు. ఉద్యోగులు 2398 మంది ఓటు కోసం నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంటివద్ద ఓటు కోసం 165 మంది నమోదు చేసుకోగా 151మంది ఓట్లు పోలైనాయని వివరించారు.

ట్రైనింగ్‌లో భాగంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి భద్రత పరమైన చర్యలను గురించి తెలుసుకునేందుకు తొమ్మిదిమంది ట్రైనీ ఐపీఎస్‌లకు జిల్లాకు విచ్చేశారు. వారు ఎస్పీ రఘువీర్ రెడ్డిని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలు, బందోబస్తు ఏర్పాట్ల గురించి ఎస్పీ వివరించారు.

మే 12, 13వ తేదీల్లో పత్రిక ప్రకటనలపై అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. పోలింగ్‌కు ముందు రోజు పత్రికలలో వేసే ప్రకటనలకు పోటీచేసే అభ్యర్థులు రెండు రోజులు ముందుగా ఎంసీఎంసీ ధ్రువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అలాగే పత్రిక యాజమాన్యాలు కూడా ఎంసీఎంసీ ధ్రువీకరణ ముందస్తు అనుమతి లేకుండా రాజకీయ పార్టీల ప్రకటనలు ప్రచురించరాదన్నారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 7న కురిసిన అకాల వర్షానికి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వై గోపీచంద్ తెలిపారు. ఉద్యాన పంటలు అరటి 152 ఎకరాలు, బొప్పాయి 45 ఎకరాలు, కొంత మొక్కజొన్న పంట వర్షంతో పాటు వీచిన గాలులకు నేలకొరిగి దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియపై నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి వచ్చిన తొమ్మిది మంది ట్రైనీ ఐపీఎస్‌లకు అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఈనెల 13వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకుంటారని ఎస్పీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బందోబస్తు, భద్రత ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి తదితర అంశాలను పరిశీలిస్తారన్నారు.

సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈనెల 13 న రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్సు ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.

ఎంసీసీ నిఘా బృందాలైన ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీలు, ఎక్స్పెండిచర్ బృందాలు వాహనాల తనిఖీలలో, నగదు, మద్యం, వస్తువుల పంపిణీలపై దృష్టి పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. రానున్న మూడు రోజుల్లో చురుకుగా పని చేయాలన్నారు. ఎంసీసీ బృందాలు పక్షపాత రహితంగా పని చేయాలనీ సూచించారు. గురువారం కలెక్టర్ నాగలక్ష్మి వెబెక్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.

మోసపు మాటలతో ప్రజలను నమ్మించి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు పన్నే కుట్రలకు ఎవరూ మోసపోవద్దని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని 2, 10వ వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు.
– భరత్ వ్యాఖ్యలపై మీరేమంటారు..?

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు విలువైనదని గుర్తించి గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అప్రమత్తమై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి గురువారం గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

జిల్లాలో గురువారం ప్లయింగ్ స్క్వాడ్‌లు నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు పశ్చిమ పరిధిలో రూ.42,500/-ల నగదు, మంగళగిరి పరిధిలో రూ.87,500/ల నగదు, గుంటూరు తూర్పు పరిధిలో రూ. 2,96,500 ల నగదు, తాడికొండ పరిధిలో రూ.35,000ల విలువ గల వస్తువులు సీజ్ చేయడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఇప్పటి వరకు రూ.3,64,11,311/ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.