India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాళ్లో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లతో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కే నాగమల్లేశ్వర్ రెడ్డి సమీక్షించారు. ఉదయగిరిలోని సెబ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు.
విజయనగరం జీఆర్పీ పరిధిలో గజపతినగరం, గరుడబిల్లి రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని మృతదేహం విజయనగరం రైల్వే పోలీసులు గురువారం గుర్తించారు. మృతుడు వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరములు ఉంటుందని వారు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప నగరంలోని రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో 10వ తేదీ ఉదయం, సాయంత్రం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-3కి క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ సౌత్ జోన్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ACA//APL player registration సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.
2024- 25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 19 ఏకలవ్య రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల SSC పాసైన గిరిజన/ గిరిజనేతర అభ్యర్థులు ప్రవేశాలకై https://aptwgurukulam.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎన్నికల సందర్భంగాఈ నెల 12 ,13 రెండు రోజులు పత్రికలలో వేసే ప్రకటనలకు పోటీ చేసే అభ్యర్థులు రెండు రోజులు ముందుగా ఎంసీఎంసీ ధృువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పత్రికల యాజమాన్యాలు కూడా ఎంసీఎంసీ ముందస్తు అనుమతి లేకుండా తమ పత్రికలలో రాజకీయ పార్టీల, అభ్యర్థుల ప్రకటనలు ప్రచురించరాదన్నారు.
ప్రచార గడువు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పిఠాపురంలో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ రోడ్‌షో చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. భారీ బహిరంగ సభ సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి పిఠాపురంలో ప్రచార ముగింపు సభ నిర్వహించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్ల పట్టణంలో రేపు నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు నేరేటి వీరాస్వామి యాదవ్ కోరారు. గురువారం మాచర్లలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1989లో పసల పెంచలయ్య(కాంగ్రెస్) S.ప్రకాశం(TDP)పై పోటీ చేసి 1502 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో ఆయన అల్లుడు కిలివేటి సంజీవయ్య(వైసీపీ) పరసా వెంకటరత్నం(టీడీపీ)పై పోటీ చేసి 61,292 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మామ అత్యల్ప మెజార్టీతో గెలవగా.. అల్లుడు అత్యధిక మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.
ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజవర్గంలో రేపటి సీఎం పర్యటన వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణానికి సీఎం జగన్ రావాల్సి ఉంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళగిరి, నగరి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. దీంతో తాడేపల్లిగూడెం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చందనోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. వివిధ జిల్లాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. గురువారం సాయంత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ తెల్లవార్లు ఇక్కడే ఉండి ఉదయం అప్పన్న నిజరూప దర్శనం చేసుకుని తిరిగి వెళతారు.
Sorry, no posts matched your criteria.