Andhra Pradesh

News May 9, 2024

ఏలూరు: సైబర్ మోసం.. రూ.53 వేలు పోగొట్టుకున్న నర్సు

image

పెదపాడు మండలం వట్లూరుPHCలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న పావనికి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. ‘ముంబయి నుంచి మాట్లాడుతున్నామని.. సైబర్‌క్రైం పోలీసులమని చెప్పాడు. మీపై కేసులు ఉన్నాయని అరెస్ట్ చేసేందుకు వస్తున్నామన్నాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బుపంపించాలని’ ఖాతా నంబర్ మెసేజ్ చేశాడు. భయంతో పావని రూ.53 వేలు పంపించింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించగా ఆమె ఖాతాను హోల్డ్ చేయించి కేసు నమోదుచేశారు.

News May 9, 2024

చిత్తూరు: ఎన్నికల విధులపై అవగాహన

image

చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్‌లో ట్రైనీ ఐపీఎస్‌లకు ఎస్పీ మణికంఠ, ప్రొబెషనరీ డీఎస్పీ పావన్ కుమార్ ఎన్నికల విధులపై గురువారం అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ గురించి వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పారు. వాహనాల తనిఖీ, నగదు రవాణా అరికట్టడం, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ అంశాలను వివరించారు.

News May 9, 2024

జి. కొండూరులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

మండలంలోని చెరువు మాధవరం రైల్వే ట్రాక్ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 55 వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు జి.కొండూరు పోలీస్ స్టేషన్‌లో తెలియచేయాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని జి. కొండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

News May 9, 2024

కళ్యాణదుర్గం సిద్ధమా?: సీఎం జగన్

image

సీఎం జగన్ కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. కళ్యాణదుర్గం సిద్ధమా? అని ప్రజలను పలకరించగానే కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘మధ్యాహ్నం 2 గంటలు కావొస్తోంది. ఎండలు చూస్తే తీవ్రంగా ఉన్నాయి. అయినా ఏ ఒక్కరూ ఖాతరు చేయలేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలను పంచిపెడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు, నా ప్రతి సోదరుడికి రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నా’అని జగన్ అన్నారు.

News May 9, 2024

టీడీపీకి మద్దతు తెలిపిన జమాత్ ఉలమ ఏ హింద్

image

టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సుహైబ్ ఖాసిమి కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖాసిమి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని జమాత్ ఉలమ ఏ హింద్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించామని చెప్పారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విధానాలు పాటించే చంద్రబాబుకు మద్దతు తెలియజేయడం సంతోషకరమన్నారు.

News May 9, 2024

రేపు మచిలీపట్నం రానున్న కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్

image

కేంద్ర కార్మిక శాఖ మంత్రి, బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ రేపు శుక్రవారం మచిలీపట్నం రానున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. NDA కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు తెలిపారు. ఎన్డీఏ విజయ శంఖారావానికి నాంది పలుకుతూ భూపేంద్ర నిర్వహించే ప్రచారానికి స్థానికులు హాజరుకావాలని స్థానిక బీజేపీ నేతలు కోరారు.

News May 9, 2024

చీరాలలో పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థి

image

చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య మనమడు పోలిశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల నుంచి తప్పుకున్నాడు. చీరాల నుంచి గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్‌గా పోటీకి దిగిన శ్రీనివాసరావు గురువారం వైదొలగి TDP అభ్యర్థి మాలకొండయ్యకు మద్దతు ప్రకటించారు. శ్రీనివాసరావుకు కొండయ్య కండువా కప్పి TDPలోకి స్వాగతం పలికారు. చేనేతల వికాసానికి కొండయ్య హామీ ఇచ్చినందున తాను సంతృప్తి చెంది పోటీ నుంచి తప్పుకున్నట్లు పోలిశెట్టి చెప్పారు.

News May 9, 2024

శ్రీకాకుళం:ఆలయ అటెండర్ పై సస్పన్షన్ వేటు

image

జిల్లాలో ఆలయాల కౌలు భూముల పన్నులకు సంబంధించి నకిలీ రసీదుల బాగోతం బయటపడింది. నగరంలోని గుడివీధి ఉమారుద్ర కోటేశ్వరాలయం ఈవో సుకన్య వివరాల మేరకు గుడివీధిలోని ఆలయ భూములకు రెండేళ్లుగా శిస్తు చెల్లించడం లేదని ఏడుగురు రైతులకు నోటీసులు ఇవ్వగా, వారు శిస్తు చెల్లించామన్నారు. అధికారులు విచారణ చేపట్టగా అటెండర్‌గా పనిచేసిన సతీశ్ నకిలీ రసీదులు ఇచ్చినట్లు విచారణలో తేలింది. అతడిని సస్పెండ్ చేశామని ఈఓ తెలిపారు.

News May 9, 2024

శ్రీ సత్యసాయి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలోని అల్లూడిలో గురువారం విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కందపల్లి గ్రామానికి చెందిన శీనప్ప విద్యుత్ మరమ్మతులు చేయడానికి స్తంభం ఎక్కగా షాక్‌కు గురయ్యాడు. లైన్‌మెన్ ఆపరేటర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 9, 2024

శ్రీకాకుళం: ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలి

image

ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల విధులు సజావుగా నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీఓల కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో 8 నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు.