India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారులతో పాటు సెక్టార్ అధికారులతో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్యలు పాల్గొన్నారు.
వేసవి కాలం నేపధ్యంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి ఎద్దడిని అధిగమించేందుకు చేపడుతున్న పనులపై ఆరా తీశారు. తాగునీటికి ఎటువంటి లోటు రాకుండా చూడాలన్నారు.
ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద ఒంగోలు-1వ పాగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం అమ్మకాలకు కొణిజేడు నుంచి 889 వేళ్లు రాగా 716 వేళ్లు అమ్ముడయ్యాయని సూపరింటెండెంట్ రవికాంత్ తెలిపారు. గరిష్ట ధర కేజీ రూ.231, కనిష్ట ధర రూ.220 పలికిందన్నారు. సరాసరి ధర రూ.228.13 వచ్చినట్లు చెప్పారు. కొనుగోలులో 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచార కార్యకలాపాలు చేపట్టాలనుకున్న రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
ఎన్నికల పాంప్లెట్ల ముద్రణ, ప్రచారం నిమిత్తం ముద్రించబోయి ఏ పేపర్లు అయినా ప్రచురణకర్తలు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం అందజేయాలని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. ప్రచురణకర్తతో తెలిసిన మరో ఇద్దరితో ధృవీకరణ పత్రం ప్రింటర్లకు ఇవ్వాలన్నారు. ప్రింటర్ కూడా ప్రచురణ కర్త ఇచ్చిన ధృవీకరణ పత్రం, ముద్రించిన దాఖలు నమూనా కాగితాలు 4 కాపీలు 3 రోజులలోగా కలెక్టరు కార్యాలయంలో అందజేయలన్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగునీటి అవసరాల కొరకు ఏప్రిల్ 8వ తేదీన సాగర్ నీరు విడుదల కానుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. విడుదలయ్యే నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు.
ఏలూరు జిల్లాలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. మొన్నటి వరకు టీడీపీ నుండి ఎంపీ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ మంగళవారం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. బీసీలకు సీఎం జగన్ న్యాయం చేశారని ఆయన తెలిపారు.
రానున్న మూడు నెలలలో మంచినీటి సరఫరాకు కావలసిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ది అధికారులు, మండల ఇంజినీరింగు అధికారులతో మంచినీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
డబ్బు సంపాదన కోసం క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన మచిలీపట్నంలోని తన కార్యాలయం నుంచి మంగళవారం తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ సీజన్ జరుగుతున్నందున అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడి కుటుంబాలను అంధకారంలో పడవేయవద్దని అద్నాన్ నయీం అస్మి కోరారు.
అనకాపల్లి జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రవి సుభాష్ ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డబ్ల్యూఎస్ గ్రామపంచాయతీ పురపాలక అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల నీటిమట్టాలను అంచనా వేస్తూ అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలన్నారు. మరమ్మతులకు గురైన బోరుబావులను యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.