India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు. ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మహోత్సవాల్లో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛంద సేవాసంస్థల భక్త బృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. అలంకార దర్శన విషయమై భక్త బృందాలు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ వెల్లడించారు. అనుమతులు లేకుండా ప్రచారాలు చేపడితే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తామన్నారు. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, ఎంసీసీ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉగాది మహోత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకుంటామని ఈఓ పెద్దిరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సేవకులు మార్చి 29వ తేదీ నుంచి ఏప్రియల్ పదో తేదీ వరకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సేవకులకు ప్రదేశాల కేటాయింపులో పారదర్శకత కోసం గత ఏడాది లాగే ఈ ఏడాది లాటరీ పద్దతిలో సేవా ప్రదేశాలను కేటాయిస్తామన్నారు.
రామకుప్పం వద్ద హంద్రీనీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పానికి నీళ్లు రావడం గ్రాఫిక్స్‌లా ఉందన్నారు. ఉత్తుత్తి ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే కనిపించిన నీరు ఇప్పుడు కనబడటం లేదని విమర్శించారు. మరి ఇంత మోసమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని హంద్రీనీవా నీళ్లు ఇచ్చినట్లు షో చేశారని మండిపడ్డారు.
అందరితో సంప్రదించిన తర్వాతే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు జంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురజాల నియోజకవర్గంలో అనిశ్చితి రాజకీయాన్ని ఆసరాగా చేసుకుని మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దల సలహాలను, సూచనలను తీసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.
ఉదయగిరిలో 1994 ఎన్నికల ప్రత్యేకతే వేరు. కంభం విజయరామి రెడ్డి టీడీపీ సీటు రేసులో ఉండగా అనూహ్యంగా కొండపల్లి గురవయ్య నాయుడు బీఫామ్ దక్కించుకున్నారు. చివరిలో మళ్లీ టీడీపీ అధిష్ఠానం కంభంకే మద్దతు పలికింది. అప్పటికే సమయం మించడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎద్దుల బండి గుర్తుతో పోటీ చేశారు. 61 శాతం ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికై కంభం సంచలనం సృష్టించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మాదాల జానకిరాం నిలిచారు.
నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య వైసీపీ గూటికి చేరారు. ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామకోటయ్య 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి 5,143 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ అప్పారావుపై గెలిచారు.
టీడీపీ ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆ పార్టీని వీడి మంగళవారం వైసీపీలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా ఏలూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గోరుముచ్చు గోపాల్ యాదవ్‌కు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఏలూరు పార్లమెంటు సీటు ఇవ్వకపోవడం కారణంగానే వైసీపీ పార్టీలో చేరినట్లు సమాచారం.
స్థానిక ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములను తెరిపించి, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన గదులను, ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం మళ్లీ గోదాములకు సీల్ వేయించారు. గోదాములలోని సీసీ కెమేరాలను తనిఖీ చేశారు. ఈవీఎంల తొలిదశ తనిఖీకి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.