India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాకు మద్దతుగా తన ఆడపడుచు ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ కూటమి మేనేఫెస్టోలో పేర్కొన్న అంశాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మే 12వ తేదిన వారికి కేటాయించిన నియోజకవర్గాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా సదుపాయం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తిరుపతి జిల్లాలోని 7-అసెంబ్లీ స్థానాలలో, ఇతర జిల్లా ఓటర్ల కొరకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు 9మే మధ్యాహ్నం వరకు నిర్వహించబడునని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మే 9వ తేదీన మధ్యాహ్నం వరకు తిరుపతి SVU క్యాంపస్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని కలెక్టర్ తెలిపారు.
పల్నాడు జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఈ నెల 9న నర్సరావుపేటలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనివార్య కారణాల చేత ఓటు వేయని ఉద్యోగులకు నరసరావుపేట SSN కాలేజీలో గల ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు. ఫామ్ 12 సమర్పించి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. పోల్ డే మానేజ్మెంట్ సిస్టం ప్రకారంగా విధులన్ని నిర్వహించాలన్నారు. బుధవారం సెక్టార్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల సిబ్బందికి సరైన ఆహారం సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్ఓ కార్యాలయాల్లో పోలీస్ సిబ్బంది కోసం ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోని వారి కోసం ఈ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ టీవీ గిరి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వెల్డర్, ప్లంబర్లకు 8వ తరగతి, మిగతా అన్ని ట్రేడ్ లకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన తప్పట్ల పాపారావు అనే రైతు మంగళవారం కురిసిన అకాల వర్షానికి పిడుగుపడి మరణించినట్లు మృతుడి కుమారుడు తెలిపారు. మృతుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడని, పొలం నుంచి వస్తుండగా పిడుగు పడి మరణించినట్లు వివరించారు. ఈ మేరకు నకరికల్లు పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ బుధవారం పరిశీలించారు. జిల్లాలో గల పార్లమెంటు, శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. ఈ పరిశీలనలో జెసి ఎం. నవీన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమా ఉన్నారు.
దివ్యాంగురాలైన యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఏలూరులోని ఓ కాలనీకి చెందిన యువతిపై అదే కాలనీకి చెందిన వెంకటరమణ 2016 ఏప్రిల్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో బుధవారం మహిళా కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి ఆ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని కోర్టు పీపీ డీవీ రామాంజనేయులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.