India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో సింగూరు కృష్ణ చైతన్య ఆల్ ఇండియా 83వ ర్యాంక్ సాధించారు. కృష్ణ చైతన్య ప్రస్తుతం EPFO డిపార్ట్మెంట్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య సొంత ఊరు సరుబుజ్జిలి మండలం కూనజమ్మన్నపేట. ఇతని తండ్రి సింగూరు రంగనాయకులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి మీనాకుమారి గృహిణి. స్థానిక గ్రామస్థులు కృష్ణ చైతన్యకు అభినందనలు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతీఒక్కరూ ఓటు వేసి, జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహిల్లా పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. కలెక్టరేట్ వద్ద పరిశీలకులు స్వయంగా మోటార్ సైకిల్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు.
13వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు 12,13 తేదీల్లో ప్రింట్ మీడియాలో అభ్యర్థుల ప్రచార ప్రకటనలకు విధిగా MCMC కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలియజేశారు. అభ్యర్థులతోపాటు మీడియా యాజమాన్యాలు కూడా MCMC నుంచి అనుమతులు తీసుకోవాలని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరగుతున్న నేపథ్యంలో శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సోమవారం 13వ తేదీన ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించామని స్విమ్స్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్ తెలిపారు. అయితే స్విమ్స్ అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
గురువారం చీపురుపల్లిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లును విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున వెంట కిమిడి సూరప నాయుడు, మొండి దివాకర్, తదితరులు పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థుల తరఫున సినీ నటుడు నారా రోహిత్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాజంపేటలో రోడ్ షో నిర్వహించనున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని రాజంపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం కోరారు. ఏర్పాట్లను పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బూరుగుపూడి నుంచి జగ్గంపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి డివైడర్‌పై పడి, తలకు బలమైన గాయమవడంతో వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్వల్ప గాయాలైన కుమారుడిని హైవే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎచ్చర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద పోలింగ్ అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపరుస్తున్న స్ట్రాంగ్ రూములను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక బుధవారం పరిశీలించారు. ఈవీఎంలు ఇతర సామగ్రి తీసుకువచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా.. చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేర నియంత్రణ చర్యలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి, డార్మిటరీలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జీల్లో ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించి, బస చేసినవారి వివరాలను తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలు ఆరా తీశారు. లాడ్జి నిర్వాహకులు సక్రమంగా రిజిస్టర్ నిర్వహించాలని పోలీసులు సూచించారు.
రాజంపేట పాత బస్టాండ్ లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ జరగనున్నది. ఈ సభకు జన సమీకరణ కోసం పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత మొట్టమొదటి సారి జగన్ రాజంపేటకు రానున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ రాజంపేటలో ప్రచారం చేసి వెళ్లారు.
Sorry, no posts matched your criteria.