Andhra Pradesh

News August 6, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

➤ ప్రకాశం కలెక్టర్, ఎస్పీలకు సీఎం అభినందనలు➤ ప్రకాశం జిల్లాలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్➤ టూలేట్ బోర్డు చూసి.. ఇంట్లోకి వచ్చి దాడి➤ సచివాలయ సెక్రటేరియట్‌పై దాడి ➤ అద్దంకిలో రాగి తీగ దొంగలు అరెస్టు➤ శ్రీశైలం డ్యాం అందాలను చూద్దాం రండి➤ అద్దంకి: మా పిల్లలు తప్పు చేయలేదు➤ త్వరలో మార్కాపురాన్ని జిల్లా చేస్తాం: ఎమ్మెల్యే కందుల➤ నాటి చరిత్రకు సాక్ష్యంగా వేటపాలెం గ్రంథాలయం

News August 6, 2024

GGHకు పేషంట్ల తాకిడి పెరిగింది: డా.ప్రభాకర్ రెడ్డి

image

కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(GGH)కు గత ఆరు నెలలతో పోలిస్తే జూలై నెలలో క్షేత్రస్థాయిలో ఓపిలు పెరిగాయని GGH సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 2700 నుంచి 3000 వరకు ఓపీలు జారీ చేస్తున్నామన్నారు. అత్యుత్తమ డాక్టర్లు, సిబ్బందిచే అధునాతన పరికరాలతో కూడిన వైద్య సేవలు, డయాగ్నొస్టిక్ సేవలను నిరంతరాయంగా అందించడం జరుగుతోందని స్పష్టం చేశారు.

News August 6, 2024

పాఠశాల విద్యపై మంత్రి లోకేశ్ సమీక్ష

image

పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం రాత్రి మంత్రి అధికారులతో సమీక్షించారు. కేజీబీవీ స్కూళ్లలో పూర్తిగా ప్రతిభ ఆధారంగానే పోస్టులు వేయాలన్నారు. గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

News August 6, 2024

సామర్లకోటలో వందేభారత్ రైలుకు హాల్టింగ్

image

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందే‌భారత్ రైలుకు సామర్లకోటలో ప్రయోగాత్మకంగా ఈనెల 3వ తేదీ నుంచి హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు. 6 నెలలపాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News August 6, 2024

సీతారాంపురం: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

సీతారాంపురంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గారపాటి చెన్నకేశవులు (42) మృతి చెందారు. సీతారాంపురంలోని కోట వీధిలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు ఓ ఇంటి వద్ద కరెంటు పనిచేసేందుకు వెళ్లాడు. అంకాలమ్మ గుడి దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం లైన్ మార్చే క్రమంలో షాక్‌కు గురై అక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు.

News August 6, 2024

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో ఎస్పీ భేటీ

image

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ఎస్పీకి సూచించారు. వారితోపాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

News August 6, 2024

శ్రీకాకుళం: పీజీ విద్యార్థులకు అలర్ట్

image

ఈ విద్యా సంవత్సరంలో శ్రీకాకుళం డా. బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 7 నుంచి వెబ్ ఆప్షన్ ప్రక్రియ మొదలు కానుందని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత తెలిపారు. ఆగస్టు 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ కొనసాగే ఈ వెబ్ ఆప్షన్ ద్వారా డా.బీఆర్ఏయూకు సంబంధించిన కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చునని తెలియజేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News August 6, 2024

త్రిబుల్ ఐటీ కళాశాల సమస్యలను పరిష్కరించండి: ఎంపీ వినతి

image

కర్నూలులోని త్రిబుల్ ఐటీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కర్నూలు ఎంపీ నాగరాజు కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ మాట్లాడుతూ.. త్రిబుల్ ఐటీ కళాశాలలో ఖాళీగా ఉన్న 36 బోధన, బోధనేతర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరినట్టు తెలిపారు.

News August 6, 2024

మధ్యవర్తులను సంప్రదించవద్దు: టీటీడీ

image

ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇటీవల వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి టికెట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొంది. అటువంటి వాటినీ బ్లాక్ చేశామని.. ఇకపై ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది.

News August 6, 2024

విశాఖ: ఆన్‌లైన్ క్విజ్.. ప్రైజ్‌మనీ రూ.40వేలు

image

ఏయూ అంబేడ్కర్ ఛైర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ఆన్‌లైన్ క్విజ్ 12న, రాత పరీక్ష 13న, ఫైనల్ పోటీలు 14న నిర్వహిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, 2వ బహుమతిగా రూ.10వేలు, 3వ బహుమతిగా రూ.5వేల నగదుతో పాటు ట్రోఫీ ఇస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోగా 97000 66832 నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.