Andhra Pradesh

News August 4, 2024

కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన IIIT డైరెక్టర్

image

నూజివీడులో ఉన్న విద్యార్థులను శ్రీకాకుళం IIIT క్యాంపస్ తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని IIIT డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం క్యాంపస్‌లోని పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు.

News August 4, 2024

ప.గో జిల్లాలో ‘ఫ్రెండ్‌షిప్ డే’న విషాదం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘ఫ్రెండ్‌షిప్ డే’న విషాదం చోటుచేసుకుంది. పేరుపాలెం బీచ్‌లో కె.జాన్‌బాబు(17) గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జాన్‌బాబు తణుకుకు చెందిన వాడిగా గుర్తించినట్లు తెలిపారు. ఆదివారం.. అందులోనూ ఫ్రెండ్‌షిప్ డే కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా పేరుపాలెం బీచ్ వెళ్లాడు. స్నానం చేస్తూ అలల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు.

News August 4, 2024

విశాఖ రేంజ్‌లో 35 మంది సీఐలు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండడంతో వీరిని మినహాయించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన సీఐలు తక్షణమే విధుల్లో చేరాలని డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.

News August 4, 2024

కాకినాడలో అరగుండు కొట్టించుకున్న టీడీపీ అభిమాని

image

అరాచక వైసీపీ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని కోరుతూ తాను ఎన్నికల ముందు మొక్కుకున్నానని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు మురళి వీరభద్రరావు తెలిపారు. ఆదివారం కాకినాడలోని ఇంద్రపాలెం గ్రామ దేవత ముసలమ్మకు సగం మొక్కును చెల్లిస్తూ సగం గుండు కొట్టించుకున్నారు. మరో సగం సోమవారం తిరుపతి పుణ్యక్షేత్రంలో చెల్లిస్తానన్నారు.

News August 4, 2024

కృష్ణా జిల్లాలో భారీగా ఎస్ఐలు బదిలీలు

image

కృష్ణా జిల్లాలో భారీ మొత్తంలో ఎస్ఐలను బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. జిల్లాలోని 23 మంది ఎస్ఐలకు స్థానం చలనం కల్పించారు. అలాగే వీఆర్‌లో ఉన్న ఎస్ఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనుకూలంగా పనిచేసిన వారికి వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

News August 4, 2024

త్వరలో తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన

image

సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో శ్రీసిటీలో పర్యటిస్తారని తెలుస్తోంది. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్యమంత్రిని కలిసి శ్రీసిటీలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతిని వివరించారు. అలాగే శ్రీసిటీని సందర్శించాలని సీఎంను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 3వ వారంలో సీఎం పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News August 4, 2024

ప్రకాశం: 3 నెలల తర్వాత మోగనున్న పెళ్లి బాజాలు

image

మూడంతో 3 నెలలుగా నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మొదలు కానున్నాయి. ఎల్లుండి నుంచి శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఫంక్షన్ హాళ్లకు గిరాకీ పెరగనుంది. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు తెలిపారు. గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

News August 4, 2024

మైదుకూరు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

image

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 167 జాతీయ రహదారిపై ఇందిరమ్మ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సును బైకు ఢీకొంది. ఈ ఘటనలో దువ్వూరు మండలం నేలటూరుకు చెందిన చందు దుర్మరణం చెందాడు. రాజేశ్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. 108లో కడప ఆసుపత్రికి తరలించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వారిద్దరూ స్నేహితులని స్థానికులు తెలిపారు. దీంతో స్నేహితుల దినోత్సవం రోజు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News August 4, 2024

రొంపిచర్ల: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం

image

రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో స్నేహితుల దినోత్సవం రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోహిత్ హైదరాబాదులో ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శనివారం వీకెండ్ కావడంతో అదే గ్రామానికి చెందిన బాల అనే స్నేహితుడితో బైకుపై హైదరాబాదుకు వెళ్లాడు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి వస్తున్న క్రమంలో రాత్రి సమయంలో బ్రిడ్జి పైన డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

News August 4, 2024

ఏలూరు: నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

image

ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన ఫణి కుమార్ అనే వ్యక్తికి కొంతమంది ఫోన్ చేసి రూ.10 లక్షలకు రూ.44 లక్షలు ఇస్తానని చెప్పారు. దీంతో ఫణికుమార్ సందేహంతో పోలీసులకి సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఒక సెల్‌ఫోన్ , నకిలీ కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు.