India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఈనెల పదవ తేదీన జరిగే చందనోత్సవానికి సంబంధించి రూ. 300 టిక్కెట్ల విక్రయాలు బుధవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆన్ లైన్‌తో పాటు సింహాచలం నగరంలోని మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లలో సింహాచలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో టిక్కెట్లు పొందవచ్చునని అన్నారు.
విజయవాడలో రోడ్ షో సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం 6.30గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. స్క్యూ బ్రిడ్జి దాటిన తర్వాత వెటర్నరీ జంక్షన్ మీదుగా పీవీపీ మాల్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న బెంజ్ సర్కిల్ దాకా.. రాత్రి 7 నుంచి 8 వరకు రోడ్ షో నిర్వహిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇలపకుర్రు గ్రామానికి చెందిన కొండేటి దుర్గాప్రసాద్‌పై 114/2024 U/s 188, 353,341,332,506,427 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న వారిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు.
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం ఐటీఐ ప్రిన్సిపల్ రామమూర్తి తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఐటీఐ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు లభించడానికి అధిక అవకాశాలు ఉన్నాయన్నారు.
భారత నౌకాదళానికి చెందిన ఢిల్లీ శక్తి కిల్తాన్ నౌకలు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఫ్లీట్ నేతృత్వంలో సింగపూర్‌కి చేరుకున్నాయి. రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ సిబ్బంది అక్కడే భారత హై కమిషనర్ స్వాగతం పలికారు. ఈ పర్యటన దక్షిణ చైనా సముద్రంలో భారత నావికాదళం, తూర్పు నావికాదళం కార్యాచరణ విస్తరణలో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య స్నేహ సహకారం మరింత పెరుగుతుందన్నారు.
ఎండలకు ఉపశమనంలా వచ్చిన వాన కొందరికి సంతోషం, మరికొందరిలో విషాదం నింపింది. పల్నాడు జిల్లా, కుందుర్రివారిపాలెంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న సంతమాగులూరుకు చెందిన జమ్ముల గోపి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బతుకుతెరువు కోసం గొర్రెలు మేపుకుంటూ వెళ్లి గోపి మృతి చెందాడు. దీంతో సంతమాగులూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్ నిర్వహించనున్నారు. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల , ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం , సాయంత్రం వేళల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ రికార్డు సృష్టిస్తోంది. జిల్లాకు చెందిన 13,076 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 12,541 మంది హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 95.9 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాలకు సంబంధించి 5,389 మంది దరఖాస్తు చేయగా 4,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో వీరి శాతం 77.78గా నమోదయింది.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు పరీక్ష రాసిన విద్యార్థులు సాధించిన మార్కుల బట్టి సీట్లను కేటాయించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ తెలిపారు. జిల్లాలో 800 సీట్లకు గాను 720 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. వారి ఫోన్‌లకు సందేశాలను పంపించామని స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీలోగా విద్యార్థులు ఆయా గురుకులాల్లో వివరాలు తెలపాలన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్య ప్రభని గెలిపించాలని కోరుతూ ప్రత్తిపాడులో ప్రముఖ సీరియల్ నటుడు ఇంద్రనీల్ వర్మ మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సత్య ప్రభను, ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.