Andhra Pradesh

News March 26, 2024

కర్నూలు: రతీ, మన్మథుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు

image

ఆదోని మండలం సంతేకుడ్లూరులో సోమవారం హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. రతీ, మన్మథుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని యువకులు, పురుషులు మహిళల వేషధారణలో ముస్తాబై ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఐదు రోజులు సాగే సంబరాలకు గ్రామస్థులు ఎక్కడ ఉన్నా ఇక్కడికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చిన రతీ, మన్మథులను దర్శించుకున్నారు.

News March 26, 2024

నేడు ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు

image

ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రామిరెడ్డి మరణించిన సందర్భంగా.. ఈరోజు (మంగళవారం) ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.పుల్లారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని కోరారు.

News March 26, 2024

విశాఖ: జనారణ్యంలోకి కణుజు 

image

విశాఖ బీచ్ రోడ్డులోని గుడ్లవానిపాలెం అమ్మవార్ల ఆలయాల ప్రాంతంలో ఓ కణుజు సోమవారం సంచరించింది. చెంగు చెంగున గంతులేస్తూ కొంత సమయం పాటు రహదారిపై అటూ ఇటూ తిరిగి సమీప జూపార్కు జాజాల గుమ్ము వైపు ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రయాణికులు ఆసక్తిగా ఈ దృశ్యాన్ని వీక్షించారు. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఇలాంటి మూగ జీవాలు గత కొంతకాలంగా తరచూ బయటకొచ్చి ప్రమాదానికి గురవుతున్నాయి.

News March 26, 2024

నేడు తిరుమలకు చిరంజీవి, రామ్ చరణ్

image

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి మంగళవారం తిరుమలకు రానున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో సాయంత్రం నాలుగు గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరి రాత్రి బస చేయనున్నారు. బుధవారం రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. విమానాశ్రయానికి అభిమానులు చేరుకోవాలని చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు ప్రభాకర్ కోరారు.

News March 26, 2024

ఆమదాలవలస: విరిగిన ఆటో చక్రం… తప్పిన ప్రమాదం

image

ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గోతుల రహదారిలోనే ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి గోతిలో దిగబడిన ఆటో ముందు చక్రం విరిగిపడింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రహదారిని బాగు చేయాలని కోరారు.

News March 26, 2024

ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు

image

కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కుప్పం పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. బాబు నగర్ వద్దనున్న మసీదులో చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

News March 26, 2024

నేటి నుంచి టైగర్‌ ట్రయాంఫ్‌–2024 సీ ఫేజ్‌ విన్యాసాలు

image

భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతానికి నిర్వహిస్తున్న టైగర్‌ ట్రయాంఫ్‌–2024లో భాగంగా మంగళవారం నుంచి సీ ఫేజ్‌ విన్యాసాలు ప్రారంభంకానున్నాయి. ఈఎన్‌సీ ప్రధాన కేంద్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు హార్బర్‌ ఫేజ్‌ విన్యాసాలు జరగాయి. మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు భారత్, యూఎస్‌ దేశాలకు చెందిన త్రివిధ దళాలు సీ ఫేజ్‌ విన్యాసాలు చేయనున్నాయి.

News March 26, 2024

దివ్యాంగులకు మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్: డీఈఓ

image

జిల్లాలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ తెలిపారు. మన్యం జిల్లా సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో 3 సం. నుంచి 18 సం. గల దివ్యాంగ విద్యార్థులకు వైకల్యం నిర్ధారించుటకు నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామన్నారు. వైకల్య నిర్ధారణ పరీక్షల అనంతరం వారికీ అవసరమగు ఉపకరణాలు అందజేస్తామని తెలిపారు.

News March 26, 2024

భక్తులతో పోటెత్తిన శ్రీగిరి క్షేత్రం

image

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం క్షేత్రం సోమవారం భక్తజనంతో పోటెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేపట్టారు. సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.

News March 26, 2024

శేష వాహనంపై ఊరేగిన కదిరి శ్రీ లక్మి నరసింహుడు

image

కదిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాల అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శేష వాహనంపై స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మాడవీధుల్లో ఊరేగింపు చేశారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు పూజలు చెల్లించుకున్నారు.