India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం గల రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. 2 పర్యాయాలు మలికిపురం మండలం చింతలమోరి సర్పంచిగా, ఒకసారి పీఏసీఎస్ అధ్యక్షునిగా పనిచేసిన రాపాక 2009, 2019 ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం రాపాకను నియమించగా బరిలో ఉన్నారు.
సాధారణ ఎన్నికల దృష్ట్యా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోను, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కార్యాలయంలోను కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సంబంధిత పిర్యాదులు, సమాచారం అందించవచ్చని ఆయన వివరించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ సామాజిక సమీకరణాలకు అనుగుణంగా, పార్టీ సీనియార్టీ ప్రధానంగా సీట్ల కేటాయింపు జరిగింది. సామాజికవర్గాల వారీగా కాపులకు 5, క్షత్రియులకు 3, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, వెలమకు 1, కమ్మకు 1 స్థానం కేటాయించారు. రెండు పార్లమెంట్ స్థానాలను బీసీల్లోని యాదవ, శెట్టిజలిజలకు కేటాయించారు.
లక్కిరెడ్డిపల్లె మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుర్నూతల పంచాయతీ బొమ్మేపల్లికి చెందిన యోగానందరెడ్డి భార్య రమణమ్మ (32)ను ఆదివారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. అనంతరం లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో యోగానందరెడ్డి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ గంగానాధ బాబు, ఎస్ఐ విష్ణువర్ధన్ క్లూస్ టీంతో మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రానికి జగన్, దేశానికి మోదీ రాహుకేతువులుగా తయారయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. డాబా గార్డెన్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. మోదీ అప్పులుపాలు చేసి దేశాన్ని తాకట్టు పెడితే.. రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టాడన్నారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశన దేశాన్ని బీజేపీ తయారుచేసిందని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారయని అన్నారు.
అత్యాచారం కేసులో నిందితుడికి జిల్లా 5వ అదనపు జడ్జి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధించినట్లు దిశ ఇన్ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన సీహెచ్ ఈశ్వరరావు 2022 ఏప్రిల్ 29న అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
అద్దంకి మండలం అమ్మాయిపాలెం గ్రామ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు బోల్తా పడి 15 మందికి గాయాలయ్యాయి. బొద్దికూరపాడుకు చెందిన సుబ్బారెడ్డి తమ కుటుంబ సభ్యులతో మనవరాలు పుట్టువెంట్రుకలు తీసుకునేందుకు బస్సులో కోటప్పకొండకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
కర్నూలులోని శ్రీగాయత్రీ ఆసుపత్రి నిర్వాహకుడు జిలానీబాషా, జ్యోతి డయాగ్నస్టిక్ మేనేజర్ కిరణ్‌పై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో శనివారం కేసునమోదైంది. వైఎస్సార్ ఆసరా పథకం కింద 2022 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 1,470మందికి పైగా పక్షవాత రోగులకు చికిత్స చేసినట్లు తప్పుడు నివేదికలతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.రూ.5.28 కోట్లు అవినీతికి పాల్పడినట్లు విచారణలో బయటపడటంతో ఆసుపత్రి అనుమతిని రద్దు చేశారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ(MBA) 6వ సెమిస్టర్, 2, 4 సప్లమెంటరీ పరీక్షలు జరిగాయి. నవంబర్‌లో బీఫార్మసీ 4, 6 సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.