India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు సీతారాం తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల బాలలకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో వచ్చే ఏడాది జనవరి 26న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేస్తారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, సాహస క్రీడలు, పర్యావరణం, కళలు రంగాల్లో ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆంధ్ర యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి మహమ్మద్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఆయన విధులకు దూరంగా ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఏయూ రిజిస్టార్ కు తన రాజీనామా లేఖ అందించి ఆయన వెళ్లిపోయినట్లు ఏయూ వర్గాలు తెలిపాయి. మూడు సంవత్సరాల క్రితం నియమితులైన ఆయన ఏయూ భద్రత పటిష్ఠం చేయడంతో పాటు పలు వివాదాలకు కూడా కేంద్రంగా మారారు.

చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలో 8 ఏళ్ల చిన్నారికి వరుసకు మామ అయ్యే వ్యక్తి, అతని స్నేహితుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. చిన్నారి ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో కుటుంబ సభ్యులు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం పార్థు, సంతోశ్ అనే ఇద్దరు వ్యక్తులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

బాలిక(16)పై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు SI ప్రియ కుమార్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలానికి చెందిన ఓ బాలిక ఈ నెల 23న అర్ధరాత్రి దాటిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో రవి అనే యువకుడు ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.

సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కే.దుర్గారావు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఏవో బొడ్డేపల్లి పద్మనాభం గురువారం తెలిపారు. మద్యం సేవించి విధులకు హాజరు కావడం విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

అనంతపురం జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం అనంతపురం పట్టణం సెయింట్ జోసెఫ్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి అమరేంద్ర యాదవ్ తెలిపారు. 16 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు.

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గురువారం కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పిఠాపురంలో కేంద్రప్రభుత్వ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (NIEL IT) ఏర్పాటుచేయాలని ఎంపీ కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న వారికి జాతీయ పురస్కారాలు అందించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన తెలిపారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. ఈ పురస్కారానికి ఆసక్తి గలవారు ఆన్లైన్లో ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పురుషులు, స్త్రీల బీచ్ కబడ్డీ జట్ల ఎంపికలు ఈనెల 27 వీరవాసరంలోని మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హై స్కూల్‌లో జరగనున్నాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సహాయక కార్యదర్శి పి.మల్లేశ్వరరావు తెలిపారు. ఈ ఎంపికలలో పాల్గొనే క్రీడాకారులు పురుషులు 85 కేజీల లోపు, స్త్రీలు 75 కేజీల లోపు ఉండాలని సూచించారు. ఒరిజినల్ ఆధార్ కార్డును వెంట తీసుకొని రావాలన్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,832 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డీఈఈ పెద్దిరాజు గురువారం తెలిపారు. పట్టిసీమలో నీటిమట్టం 22.987 మీటర్లు నమోదు కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్లతో నీటిని వదిలినట్టు వివరించారు. కృష్ణా డెల్టా, ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల నేపథ్యంలో నీరు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.