India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజమండ్రిలో సోమవారం జరిగిన ప్రధాని మోదీ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోదీని మంగళగిరి చేనేత కండువాతో నారా లోకేశ్ సత్కరించారు. ప్రధానిని చేనేత కండువాతో సత్కరించడంతో మంగళగిరిలోని చేనేత వర్గీయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోకేశ్ కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పర్యటన చేస్తున్నారు. నేటి నుంచి తిరిగి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.

భర్తను హత్య చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి ఒంగోలు సెషన్స్ జడ్జి యావజ్జీవ జైలుశిక్ష విధించారు. పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన బధిర యువకుడు నవాబు సురేశ్‌కు శివ అనే మహిళతో 14 ఏళ్ల కిందట వివాహమైంది. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఆరుద్ర సాంబశివరావుతో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సురేశ్‌ను నిందితుడు సాంబశివరావు హత్య చేశాడు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యకేసు ప్రస్తావించారనే ఆరోపణలపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎన్నిలు పూర్తయ్యే వరకు వివేకా హత్యపై ప్రచారాల్లో మాట్లాడకూడదని కడప కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈనెల 9న సీఎం జగన్ కళ్యాణదుర్గానికి రానున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య తెలిపారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు. కావున నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నెల్లూరు రాజకీయాల్లో ఎప్పుడూలేని విధంగా కొత్త ఒరవడి మొదలైంది. పార్టీల మేనిఫెస్టోలు కాకుండా అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపకల్పన చేశారు. వైసీపీ నెల్లూరు అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేశారు. నిన్న కోవూరు కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమారెడ్డి, ఎంపీ అభ్యర్థి రాజు మేనిఫెస్టోను ప్రకటించారు. సర్వేపల్లిలోనూ సోమిరెడ్డి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు.

విజయనగరం సంస్థానాధీశుడు పీవీజీ రాజుకు స్వయంగా చిన్నాన్న అయిన పూసపాటి విజయానంద గజపతిరాజు(సర్ విజ్జీ) 1962లో విశాఖ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1926లో సొంతంగా క్రికెట్ జట్టును ఏర్పాటు చేసుకుని 1938లో ఇంగ్లాండ్ వెళ్లి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. దీంతో ఆయన 1952లో బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. క్రికెట్‌కు విస్తృత ప్రచారాన్ని కల్పించిన ఆయన 1965లో కన్నుమూశారు.

జామి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. మండల వ్యాప్తంగా 27 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిలో 13 పంచాయతీలు శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోనూ, మిగిలిన మరో 14 పంచాయతీలు గజపతినగరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి ఈ మండలానికి శృంగవరపుకోట, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తూ వస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు జిల్లాకు వస్తున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో మంగళవారం మధ్యాహ్నం జరిగే యువగళం సభకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున యువత, నిరుద్యోగులను ఆహ్వానిస్తున్నారు. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లలో లోకేష్ ముఖా ముఖీ మాట్లాడతారు. తొలుత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రసంగిస్తారు

వివాహాది శుభ కార్యాలకు ఆహ్వాన పత్రికలను అట్టహాసంగా ముద్రించడం పరిపాటి. ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్పులు మాత్రమే పంచి పెడతారు. కానీ కర్నూలు కలెక్టర్ జి.సృజన వినూత్నంగా ఆలోచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు మించిన శుభకార్యం వేరే ఏముంది అనుకున్నారు. ‘ఎన్నికల పర్వం దేశానికే గర్వం’ అంటూ ఈ శుభ కార్యానికి జిల్లా పెద్దగా ప్రజలందరికీ ఆహ్వానం పంపారు. మే13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేయాలని కోరారు.

కడప జిల్లా ప్రజల దశాబ్దాల కల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు. కానీ అది శంకుస్థాపనలకే పరిమితమై, ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటి వరకు ముగ్గురు సీఎంలు శంకుస్థాపనలు చేశారు. 2007 జూన్ 10న YSR మొదటగా పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. మళ్లీ పదేళ్లకు 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక మూడోసారి జగన్ 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందో అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.