India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతిని మంగళవారం అన్ని చోట్ల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్మారక ప్రాంతాలైన కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెం, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటతో పాటు అల్లూరి దాడులు జరిపిన రాజవొమ్మంగి, చింతపల్లి, అడ్డతీగల పోలీసు స్టేషన్ల వద్ద వర్థంతి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జాతీయ అల్లూరి యువజన సంఘం సభ్యులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో APSRTC హెవీ లైసెన్స్ కోసం శిక్షణ పొందుటకు అడ్మిషన్స్ జరుగుతున్నాయని జిల్లా ప్రజారవాణా అధికారి విజయ కుమార్ సోమవారం తెలిపారు. శిక్షణ కోసం లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ LMV (ఫోర్ వీలర్) లైసెన్స్ ఉండాలని అన్నారు. ఇప్పటివరకు 15 బ్యాచ్‌లలో సుమారు 250 మంది డ్రైవర్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.
నెల్లూరులో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులందరూ 8వ తేదీలోగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా సోమవారం పోలీస్ గెస్ట్ హౌస్‌లో ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, సాధారణ పరిశీలకులు పాల్గొన్నారు.
టీడీపీ రాష్ట్ర కమిటీలో అనంతపురం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం అర్బన్ నియోజక వర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శిగా రాయల్ మురళీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండవీటి భావన, కళ్యాణదుర్గం నుంచి తెలుగు యువత కార్యదర్శిగా అనిల్ చౌదరికి అవకాశం కల్పించారు.
కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మొదటి రోజు హోమ్ ఓటింగ్‌కు సంబంధించి 997 మందికి గాను 634 మంది (64 శాతం) పాల్గొన్నారని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. మరో రెండు రోజుల్లో హోం ఓటింగ్ కార్యక్రమాన్ని 100% ఓటింగ్ నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం బాపట్ల జిల్లాలోని కర్లపాలెం, చందోలు గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. గత ఎన్నికల పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా ఉంటుందన్నారు.
పాడేరులోని తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా, మూడవ రోజైన సోమవారం 864 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిస్ట్ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది, అధికారులు, సిబ్బంది స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి రెండు రోజులు సమయం పెంచినట్లు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. పార్వతీపురం ఎస్‌వీడీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఏడు, ఎనిమిది తేదీలలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని సూచించారు.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో MPED, BPED, DPED నాలుగవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.