India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డీసీఎం ఏకె. త్రిపాఠి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 28వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ- గుంటూరు- (22701), గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖ- మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. మరికొంటిని దారి మళ్లించారు.
తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ నల్లపాటి ఉమాపతి నాయుడు తెలిపారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గం టీడీపీలో మితిమీరిన గ్రూపు తగాదాల కారణంగా పార్టీలో పనిచేయ లేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని చెబుతున్నా.. ఇక్కడ నాయకులు విస్మరిస్తున్నారన్నారు.
గ్రామ/వార్డు వాలంటీర్లు రాజకీయ నేతలతో తిరిగిన, పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయరామరాజు హెచ్చరించారు. కడపలో శనివారం ఎస్పీ, కమిషనర్‌తో కలిసి ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. వాలంటీర్లు రూల్స్ అతిక్రమించినట్లు ఎవరైన ఫిర్యాదు చేస్తే వారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న సీఎం జగన్ ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. ఆలూరు నియోజకవర్గంలో రెండు దఫాలుగా వైసీపీ విజయం సాధిందించి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను కాదని విరుపాక్షికి టికెట్ కేటాయించడంతో మూడోసారి వైసీపీ జెండా ఎగరాలని సీఎం పర్యటిస్తున్నట్లు నాయకులు చర్చించుకుంటున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల బరిలోకి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పిరియా విజయ మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న పిరియా విజయకు పార్టీ టికెట్ కేటాయించింది. అటు రాజాంలో డాక్టర్‌గా పనిచేస్తున్న తలే రాజేశ్ కూడా మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొదటిసారి కావడంతో వీరికి విజయం వరిస్తుందో..? లేదో..? వేచి చూద్దాం.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాతోపాటు మండలాల్లో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలోనూ కోడ్ అమలులోకి వచ్చిందని, అందువల్ల స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 28982 మంది ప్రైవేటు విద్యార్థులు 1592 మంది హాజరు కానున్నట్లు చెప్పారు.
నెల్లూరు జిల్లా వైసీపీ అభ్యర్థులు పలువురు సీనియర్లు ఉండగా.. మరికొందరు తొలిసారి పోటీ చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 9వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి 5వ సారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్, గూడూరులో మురళీ తొలిసారి పోటీ చేస్తున్నారు.
నేడు చిలకలూరిపేటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా, గుంటూరు రేంజ్ ఐజి పాలరాజు పర్యవేక్షణలో వీవీఐపి కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. ప్రజాగళం సభకు 3900 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో ఆరుగురు ఎస్పీలు, 11 మంది అడిషనల్ ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు ఉన్నారన్నారు. పోలీసులకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా మెలగాలని సూచించారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు నేపథ్యంలో కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఎవరికి దక్కుతుందనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ తరఫున ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి,మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. జనసేన తరఫున మత్తి వెంకటేశ్వరరావు, మాదివాడ వెంకట కృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.