India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
D.El.Ed 4వ సెమిస్టర్ పరీక్షలకు ప్రైవేటు విద్యార్థులు ఈనెల 8వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నెలలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 4 సబ్జెక్టులకు రూ.250, 3 సబ్జెక్టులకు రూ.175, రెండింటికి రూ.150 ఒక సబ్జెక్టు రూ.125 చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభలో విజయానంద రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు. మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు మాటమీద నిలబడే వ్యక్తి కాదని, 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన హామీలను కాపీ కొట్టి ఆంధ్ర రాష్ట్రంలో చేస్తానని చెప్తున్నాడన్నారు.
అనంతపురంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి నిర్వహించే ఆర్డీటీ సెట్ ప్రవేశ పరీక్షకు 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మోహన్‌మురళీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్ పరీక్షకు అర్హులన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీసుల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన బొమ్మసాని నాగేశ్వరావు(55) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రఘునాథరావు సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసగా మారి ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడంతో భార్య మందలించింది. క్షణికావేశంతో అతడు పురుగు మందు తాగగా, కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో ఈనెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక పోలింగ్లో ఎస్సీ, ఎస్టీలను ఓటు వేయకుండా అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినేశ్ కుమార్ హెచ్చరించారు. ఓటు వేయకుండా అవాంతరాలు కల్పించినా, తమకు చూపించి ఓటువేయాలని బెదిరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదివారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో దళితసంఘం నాయకులు ప్రచురించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి విమర్శించారు. విశాఖ శ్రీనగర్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఎన్డీఏ కూటమికి అండగా ఉంటామని అంటున్నారని తెలిపారు. రాజధాని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును జగన్ పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
సోమవారం ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజిలో రెండోరోజు కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అవకాశం ఉందన్నారు. అనంతరం ఉదయగిరి సమీకృత ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల కమిషనింగ్ ను సందర్శించారు.
జిల్లాకు చెందిన నాయకులు 18 మంది మంత్రులుగా పని చేశారు. మొదటగా గౌతు లచ్చన్న మంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ నుంచి లుకరావు లక్ష్మణదాస్ గృహ నిర్మాణ, గొర్లె శ్రీరాములు, TDP తంగి సత్యనారాయణ రెవెన్యూ, ప్రతిభభారతి, కళా వెంకట్రావు, గుండ అప్పల సూర్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు మంత్రులుగా చేశారు. అచ్చెన్నాయుడు కార్మికశాఖ, ధర్మాన రెవెన్యూ, 2021లో సీదిరి పశువైద్యం, పాడి పరిశ్రమ మంత్రిగా, తదితరులు ఉన్నారు.
ఉదయగిరి నుంచి ఎందరో పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఏ పార్టీ కూడా మహిళలు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఉదయగిరి నుంచి ఈసారి 16మంది బరిలో ఉండగా.. తొలిసారి BSP నుంచి క్రాకుటూరి పుష్పాంజలి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ నుంచి కాకర్ల సురేశ్ పోటీ చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 2,41,861 మంది ఉండగా, వారిలో పురుషులు 1,20,108 మంది, మహిళలు 1,21,743 మంది ఉన్నారు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ప్రత్యర్థుల పోటాపోటీ కౌంటర్స్‌తో ఉమ్మడి ప.గో జిల్లాలో ఎన్నికల ప్రచారం హీటెక్కగా.. పాలకొల్లులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నరసాపురం కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఆదివారం ఓ కార్యక్రమంలో ఎదురుపడ్డారు. సోదరభావంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైతం ఉమాబాలతో కరచాలనం చేసి ముచ్చటించారు.
Sorry, no posts matched your criteria.