Andhra Pradesh

News March 25, 2024

విశాఖ ఇందిరాగాంధీ జూలో జిరాఫీ మృతి

image

విశాఖ ఇందిరాగాంధీ పార్కులో సోమవారం తెల్లవారుజామున జిరాఫీ మృతి చెందింది. గతంలో రెండు జిరాఫీలు ఉండేవి. అందులో ఒకటి ఇప్పటికే మృతి చెందగా ఈరోజు మరో జిరాఫీ మృతి చెందింది. దీంతో జూ పార్క్‌లో ఉన్న జిరాఫీల ఎన్‌క్లోజర్  ఖాళీ అయింది. జంతువుల వరుస మరణాలతో జూ పార్క్ వెలవెలబోతోందని జంతు ప్రేమికులు అంటున్నారు. అధికారుల తగు జాగ్రత్తలు తీసుకొని జంతువులను కాపాడాలని కోరుతున్నారు. 

News March 25, 2024

శ్రీ సత్యసాయి: పసికందుకు ఓకే రోజు 3 వ్యాక్సిన్‌లు.. మృతి

image

రొళ్ల మండలం దొడ్డేరి పంచాయతీలో ANM, వైద్యుల నిర్లక్ష్యం పసికందు(నెల)ను బలి తీసుకుంది. పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లు గ్రామానికి చెందిన రాధమ్మ, దొడ్డ హనుమ దంపతులకు జన్మించిన పసికందుకు ANM వరలక్ష్మి ఈనెల 23న 3 వ్యాక్సిన్‌లు వేశారు. అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున పసికందు మరణించింది. తమ బిడ్డ మరణానికి ANM, వైద్యులే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.

News March 25, 2024

విజయవాడ: బొండా తన రికార్డు చెరిపేస్తారా?

image

2008లో ఏర్పడ్డ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో మినహా ప్రతిసారి బొండా టీడీపీ తరపున బరిలో నిలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిన ఆయన 2014లో 27,161 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. బొండా సాధించిన ఈ మెజారిటీనే సెంట్రల్‌లో అత్యధికం కాగా..2024లో టీడీపీ నుంచి మరోసారి బరిలో ఉన్న బొండా ఈ రికార్డును చెరిపేస్తారా.. కామెంట్ చేయండి.

News March 25, 2024

కర్నూలు: వైసీపీని వీడిన మంత్రికి టీడీపీలో దక్కని టికెట్

image

ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్ టీడీపీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. అయితే అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలోనూ ఆయనకు టికెట్ కేటాయించలేదు. అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రతికూలత రావడంతో గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆలూరుపై ఆశలు పెట్టుకున్న జయరాం కోట్ల సుజాతమ్మ మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

News March 25, 2024

ఉమ్మడి ప.గో జనసేన అభ్యర్థుల విద్యార్హతలు

image

ఉమ్మడి ప.గోలోని 15స్థానాలకు ‘కూటమి’ తరపున జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. వారి విద్యార్హతలేంటో చూద్దాం.
☞ పోలవరం- చిర్రి బాలరాజు(బీఏ) (2వసారి బరిలో)
☞ నరసాపురం-బొమ్మిడి నాయకర్(డిగ్రీ) (2వ సారి బరిలో)
☞ ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు(ITI ఎలక్ట్రికల్) (తొలిసారి బరిలో)
☞ తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్(బీకాం) (2వసారి బరిలో)
☞ భీమవరం- పులపర్తి రామాంజనేయులు (ఇంటర్) (4వసారి పోటీ)

News March 25, 2024

ప్రొద్దుటూరు నుంచి సీఎం జగన్ రూట్ మ్యాప్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారానికి ప్రొద్దుటూరు నుంచి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 27న ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి, అనంతరం వేంపల్లె, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. బైపాస్ లోని వాసవి సర్కిల్ నుంచి, సినీహబ్, శివాలయం సర్కిల్, రాజీవ్ సర్కిల్, కొరప్రాడు రోడ్డు మీదుగా సభా స్థలి వద్దకు చేరుకుంటారు.

News March 25, 2024

శ్రీకాకుళం: జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తా

image

పలాస మండలం శాసనాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఐచర్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ.. వాహనాన్ని క్రేన్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

News March 25, 2024

పలమనేరు: ఏడుగురు జూదరుల అరెస్ట్

image

పట్టణంలోని శ్రీనగరాకాలనీ సమీపంలో ఒక ప్రైవేటు ఐటిఐ సమీపంలో జూదమాడుతున్న ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఆకస్మికంగా దాడి చేసి అరెస్టు చేశారు. వారిలో పట్టణానికి చెందిన హోంగార్డు మహేష్ ఉన్నారు. అతనితో పాటు పట్టణానికి చెందిన చిన్న, మురుగ, చందు ప్రకాష్, మధుకర్, మారిముత్తు, సామిదొరై, అరెస్టు చేసి వారి నుంచి రూ.5000, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.

News March 25, 2024

ఏప్రిల్ నెలాఖరులో నిసార్ ఉపగ్రహ ప్రయోగం

image

ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెలలోనే ఈ ప్రయోగం చేపట్టాల్సివుంది . అయితే ఉపగ్రహ రాడార్ యాంటెన్నా రిఫ్లెక్టర్ కు అదనపు పూత అవసరమని శాస్త్రవేత్తలు భావించడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఆ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయోగం ఏప్రిల్ నెలాఖరులో జరిగే అవకాశం ఉంది.

News March 25, 2024

తాడిపత్రి: పెళ్లి రద్దు కావడంతో యువకుడి ఆత్మహత్య

image

తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లికి నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరాజు ఐచర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల నంద్యాలలో పెళ్లి సంబంధం కుదిరింది. కొన్ని కారణాలతో ఆ సంబంధం ఆగిపోయింది. దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.