Andhra Pradesh

News September 22, 2025

రాజమండ్రి: హ్యాండ్‌కఫ్స్‌తో ఖైదీ పరార్

image

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకు తీసుకెళ్లి తిరిగి తీసుకువస్తున్న సమయంలో బత్తుల ప్రభాకర్ అనే ఖైదీ తప్పించుకున్నట్లు పోలీసుల తెలిపారు. సోమవారం రాత్రి దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలో వాహనం ఆపగా అతడు పరారయ్యాడని పేర్కొన్నారు. తప్పించుకునే సమయంలో నిందితుడి చేతులకు హ్యాండ్‌కఫ్స్‌ ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసినవారు 94407 96584 నంబరుకు సమాచారం ఇవ్వాలని సీఐ నాయక్ కోరారు.

News September 22, 2025

ప్రజా పిర్యాదులపై దృష్టి సాధించాలి: జిల్లా ఎస్పీ

image

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీసు సిబ్బంది దృష్టి సాధించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు 110 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపించారు.

News September 22, 2025

ANU: దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ లు సోమవారం విడుదల చేశారు. ఎంబీఏ 600 మందికి 435మంది, ఎంసీఏ 128 మందికి 80మంది అర్హత సాధించారన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.anucde.info. నుండి ఫలితాలు పొందవచ్చు అన్నారు.

News September 22, 2025

అనంతపురం జిల్లాకు స్కోచ్ అవార్డు

image

అనంతపురం జిల్లాలో APMIP వివిధ పథకాల ద్వారా స్కోచ్ అవార్డును దక్కించుకుంది. కాగా అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో APMIP అధికారులు కలెక్టర్ ఆనంద్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ విజయం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ, APMIP PD రఘునాథ్‌రెడ్డి, ఉద్యాన శాఖాధికారి ఉమాదేవి పాల్గొన్నారు.

News September 22, 2025

ఆలూరు టీడీపీ నూతన ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి

image

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News September 22, 2025

విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

image

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.

News September 22, 2025

4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఖరీఫ్ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై జరిగిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సీజన్‌లో మొత్తం 5.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వమే కొనుగోలు చేయనుందని తెలిపారు.

News September 22, 2025

పెంచలకోనలో ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

image

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించారు.

News September 22, 2025

నన్నయ యూనివర్సిటీ, నాందీ ఫౌండేషన్‌ల మధ్య ఒప్పందం

image

ఆదికవి నన్నయ యూనివర్సిటీ – నాందీ ఫౌండేషన్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సోమవారం యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.వి స్వామి, నాందీ ఫౌండేషన్ రీజనల్ మేనేజర్ శ్రీలక్ష్మి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. నాందీ ఫౌండేషన్‌తో ఎంఓయూ చేసుకున్న తొలి వర్సిటీ గా ‘నన్నయ’ వర్సిటీ నిలుస్తుందన్నారు.

News September 22, 2025

540 అర్జీలను స్వీకరించిన కలెక్టర్ ఆనంద్

image

అనంతపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తీసుకున్న 540 అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.