India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గన్నవరం విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మోదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళతారన్నారు. నగరంలో రోడ్ షో అనంతరం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 11న భీమవరానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాన్ని, రూట్ మ్యాప్‌ను స్థానిక నేతలతో కలిసి ఆదివారం బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారపాడు తపనా చౌదరి పరిశీలించారు. అమిత్ షా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.
విశాఖలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు సమన్వయకర్త ఈశ్వరి ప్రభాకర్ తెలిపారు. ఈ పరీక్షకు 8,038 మంది దరఖాస్తు చేసుకోగా 7,861 మంది హాజరయ్యారని వివరించారు. ఇందులో 5,800 మంది బాలికలు కాగా 2,061 మంది బాలురు ఉన్నారని తెలిపారు. నగరంలో మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ వేరే జిల్లాలలో ఓటరుగా నమోదు అయి ఉన్న 6,812 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును ఆదివారం వినియోగించుకున్నారు.
➠విజయనగరం: 1356
➠చీపురుపల్లి: 385
➠గజపతినగరం: 603
➠నెల్లిమర్ల: 587
➠బొబ్బిలి: 749
➠ఎస్.కోట: 563
➠పార్వతీపురం: 1098
➠కురుపాం: 925
➠సాలూరు: 546
పాపాల పెద్దిరెడ్డీ! నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ‘తంబళ్లపల్లి(మం) కూటగోళ్లపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి సమక్షంలో తాగునీరు కోసం నిలదీసిందని నిండు గర్భిణిపై పెద్దిరెడ్డి ముఠాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీ పాపాలకు తగిన శిక్ష మే 13న జనం విధిస్తారు పెద్దిరెడ్డీ’ అని ట్విట్ చేశారు.
పోస్టల్ బ్యాలెట్ వివరాలను అధికారులు ప్రకటించారు. పుంగనూరు 76.3%, నగరి 83%, జీడి నెల్లూరు 79.5%, చిత్తూరు 65%, పూతలపట్టు 75.4% పలమనేరు 71.3% కుప్పం 79. 2 శాతం నమోదు అయినట్టు వారు చెప్పారు. మొత్తం జిల్లాలో 74.3% పోలింగ్ నమోదు అయినట్టు వారు చెప్పారు.
టీడీపీ అధికారంలోకి వస్తే రైతులను అన్నివిధాల ఆదుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. అనంతపురం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… వైసీపీ రైతుల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకుంటామని మోసం చేసిందన్నారు. సబ్సిడీ పరికరాలు ఇవ్వలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఆభ్యర్థులను గెలిపించాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా హోం ఓటింగ్ ప్రక్రియ జిల్లాలో సోమవారం జరగనుంది. దానికి సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించారు.
85 ఏళ్ల పైబడిన ఓటర్లు: 11,421
దివ్యాంగుల ఓటర్లు: 21,517
మొత్తం ఓటర్లు: 32,938
హోం ఓటింగ్‌కి దరఖాస్తు చేసుకున్న ఓటర్లు:
85 ఏళ్ల పైబడినవారు: 310
దివ్యాంగ ఓటర్లు: 185
మొత్తం ఓటర్లు: 495. హోమ్ ఓటింగ్ కోసం జిల్లాలో 188 ప్రత్యేక బృందాలను నియమించారు.
జీవీఎంసీ 77వ వార్డు పరిధిలో సగం విశాఖపట్నం జిల్లా, మరో సగం అనకాపల్లి జిల్లా పరిధిలో ఉంది. జిల్లాల పునర్విభజనలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించారు. అయితే విలీన పంచాయతీలు మాత్రం విశాఖ జిల్లాలోనే ఉంచారు. ఈ ప్రాంతంలో ఓటర్లు పెందుర్తి అసెంబ్లీకి, అనకాపల్లి పార్లమెంటుకు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ నివసించేది మాత్రం విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం. ఈ ప్రాంతం గాజువాక జోన్ పరిధిలో ఉంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇవాళ కోవూరులో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైతుల రుణ మాఫీ జరగలన్నా , ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 1 లక్ష ఆర్థిక సాయం కావాలన్నా ఎమ్మెల్యే గా కిరణ్ ను, ఎంపీగా కె.రాజును గెలిపించాలని ఆమె కోరారు.
Sorry, no posts matched your criteria.