Andhra Pradesh

News May 5, 2024

కర్నూలు: ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు

image

కోడుమూరు పట్టణ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం ఉదయం కారు ట్యాంకర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఎమ్మిగనూరుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

గాజువాకలో క్రికెట్ ఆడిన గుడివాడ అమర్నాథ్

image

గాజువాకలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక జింక్ గ్రౌండ్లో వాకర్స్, క్రీడాకారులను ఆదివారం కలుసుకున్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆయన మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో క్రీడాకారులు అధికంగా ఉన్నారని, వీరిని ప్రోత్సహించేందుకు గాజువాకలోని ఓపెన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు.

News May 5, 2024

ఈనెల 6న రేపల్లెలో సీఎం జగన్ పర్యటన

image

ఈనెల ఆరోతేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లె వస్తున్నారని, రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేశ్ తెలిపారు. రేపల్లె తాలూకా సెంటర్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు సీఎం జగన్ పర్యటన విజయవంతం చేయాలని డాక్టర్ గణేశ్ కోరారు.

News May 5, 2024

షర్మిల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి: రాఘవరెడ్డి

image

షర్మిల నోరు అదుపులో పెట్టుకొని విమర్శలు చేయాలని YSRTP నాయకుడు కొండ రాఘవరెడ్డి మండిపడ్డారు. నిన్న జగన్‌పై షర్మిలా చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన కడపలో కౌంటర్ ఇచ్చారు. వివేకా హత్య కేసులో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. సీఎంకు అద్దం చూపించడం కాదని.. ఒకసారి మీ ముఖం అద్దంలో చూసుకోవాలన్నారు. తెలంగాణలో మీరు చేసిన అక్రమాలతో వందల కుటుంబాలు నాశనం అయ్యాయన్నారు. వాస్తవాలు త్వరలో బయటపెడతా అన్నారు.

News May 5, 2024

కృష్ణుడి ఫొటోతో ప్రచారం.. MLA పదవి కోల్పోయి

image

ఒక్క ఫొటో.. MLA పదవిని కోల్పోయేలా చేసింది. 1989లో పాతపట్నంకు జరిగిన ఎన్నికల్లో TDP అభ్యర్థి కలమట మోహనరావు గెలుపొందారు. NTR కృష్ణుడి వేషంలోని బొమ్మతో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించారని కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన నారాయణ హైకోర్టుకు వెళ్లారు. తీర్పుతనకు వ్యతిరేఖంగా వచ్చిందని కలమట సుప్రీంకోర్టుకు వెళ్లారు. తీర్పువచ్చేలోపే 1994లో వచ్చిన ఎన్నికల్లో మరోసారి గెలిచారు. 1996లో తీర్పురాగా కలమట పదవి కోల్పోయారు.

News May 5, 2024

చిత్తూరు: బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉద్యోగులు ఓటు వేస్తున్నారు. పుంగనూరు పట్టణంలోని బసవరాజ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం కావడంతో సీఐ రాఘవరెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటర్లు నడుచుకోవాలని సూచించారు.

News May 5, 2024

చీపురుపల్లిలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

చీపురుపల్లి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. గరివిడి ఎస్ డీ ఎస్ డిగ్రీ కాలేజీలో ఓటింగ్ కొనసాగుతోంది . నాలుగు మండలాల వారీగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. RO నాగలక్ష్మి పర్యవేక్షణలో ఎలక్షన్ మొత్తం ప్రశాంతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. 

News May 5, 2024

NLR: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఇవాళ ఓటు వేయనున్నారు. కావలి జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు. ఉద్యోగులు క్యూలైన్లలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈనెల 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం ఉంది.

News May 5, 2024

జగ్గయ్యపేటలో గెలిచి చరిత్ర సృష్టించిన భార్యాభర్తలు

image

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యాభర్తలు MLAలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. ముక్తాల గ్రమానికి చెందిన వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వరప్రసాద్ అప్పటి ఎన్నికలో స్వంతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్‌పై MLAగా గెలుపొందారు. 1974లో అయన మరణానంతరం భార్య రాజ్యలక్ష్మమ్మ కాంగ్రెస్‌లో చేరి MLAగా గెలిచి 4ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్యాభర్తలు MLAగా గెలిచిన ఘనత అప్పట్లో జగ్గయ్యపేటకే దక్కింది.

News May 5, 2024

తూ.గో.: అక్కడ 70 ఏళ్లుగా 3 కుటుంబాల వ్యక్తులే MLAలు

image

ప్రత్తిపాడులో 70 ఏళ్లుగా పర్వత, ముద్రగడ, వరుపుల కుటుంబాలకు చెందిన వ్యక్తులే MLAలుగా ఎన్నికవడం గమనార్హం. ప్రత్తిపాడులో 14 సార్లు ఎన్నికలు జరగగా.. పర్వత గుర్రాజు కుటుంబానికి చెందిన వారు 5సార్లు, ముద్రగడ పద్మనాభం 4సార్లు, ఆయన తండ్రి వీరరాఘవరావు 2సార్లు గెలిచారు. వరుపుల జోగిరాజు కుటుంబానికి చెందిన వారు 3 సార్లు గెలుపొందారు. ఈ సారి YCPనుంచి వరుపుల సుబ్బారావు, కూటమి నుంచి వరుపుల సత్యప్రభ బరిలో ఉన్నారు.