Andhra Pradesh

News May 5, 2024

శ్రీకాకుళం : ఈ నెల 7న రాజ్ నాథ్ సింగ్ రాక

image

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈనెల 7న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి NDA కూటమి తరుపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నడుకుదిటి ఈశ్వరరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఆ రోజు 11.50కి విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 12.10కి ఎచ్చెర్ల హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.10 వరకు ఎచ్చెర్ల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

News May 5, 2024

RK బీచ్‌లో వాలీబాల్ ఆడిన బాలయ్య కుమార్తె

image

విశాఖలోని RK బీచ్ నుంచి YMCA వరకు వాక్ చేస్తూ శ్రీభరత్, తేజస్విని, వెలగపూడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ MP అభ్యర్థిగా శ్రీభరత్ ను గెలిపించాలని కోరారు. అనంతరం వారు RK బీచ్‌లో వాలీ బాల్ ఆడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఏపీ భవిష్యత్ బాగుపడాలంటే కూటమిని గెలిపించాలని కోరారు.

News May 5, 2024

RK బీచ్‌లో వాలీబాల్ ఆడిన బాలయ్య కుమార్తె

image

విశాఖలోని RK బీచ్ నుంచి YMCA వరకు వాక్ చేస్తూ శ్రీభరత్, తేజస్విని, వెలగపూడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ MP అభ్యర్థిగా శ్రీభరత్ ను గెలిపించాలని కోరారు. అనంతరం వారు RK బీచ్‌లో వాలీ బాల్ ఆడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఏపీ భవిష్యత్ బాగుపడాలంటే కూటమిని గెలిపించాలని కోరారు.

News May 5, 2024

TPT: వెబ్‌సైట్‌లో టెన్త్ మార్కుల లిస్టులు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల జాబితాలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు తిరుపతి డీఈవో శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల HMలు వాటిని డౌన్‌లోడ్ చేశాక అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందజేయాలని.. వాటితో విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశం పొందవచ్చన్నారు.

News May 5, 2024

విశాఖ వాసులుకు చల్లటి కబురు.. వర్ష సూచన

image

భానుడి ప్రతాపానికి భగభగలాడిన విశాఖ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. విశాఖ , అనకాపల్లి జిల్లాలో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News May 5, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

అద్దంకిలోని సింగరకొండ రోడ్డులో ఆదివారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కావలికి చెందిన రాజేష్, నెల్లూరుకి చెందిన చరణ్‌లు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళుతుండగా అద్దంకి దగ్గరకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, చరణ్‌ను 108లో ఒంగోలు తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 5, 2024

గుంటూరు: రెండు బైకులు ఢీ.. పలువురికి గాయాలు

image

గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటుకూరు బైపాస్ వివాహ కన్వెన్షన్ ఎదురుగా శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి వేగంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణించే పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

News May 5, 2024

విశాఖ: నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఆదివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. 5వ తేదీ నుంచి 8 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆదివారం పీఓలు ఏపీఓలకు, 6న ఓపీఓలకు ఓటింగ్ ఉంటుందన్నారు.. ఈ మేరకు ఏయూ తెలుగు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల ఆవరణలో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News May 5, 2024

గంటల తేడాలో పార్టీలు మారిన కౌన్సిలర్

image

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. స్థానిక నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ, మురళి దంపతులతో కలిసి 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ టీడీపీలో చేరారు. కానీ గంటల తేడాలోనే యూటర్న్ తీసుకున్నారు. కోవూరు MLA నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ కండువా కప్పుకొన్నారు.

News May 5, 2024

కడప జిల్లాలో వడదెబ్బకు నలుగురి మృతి

image

జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలకు వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం ఒక్క రోజే వడదెబ్బతో బి.కోడూరు-గురివిరెడ్డి, చాపాడు-ఓబుళమ్మ, సోగలపల్లె-కొండూరు వెంకటన్న, పోరుమామిళ్ల-వెంకట సుబ్బయ్య, ఖాజీపేట-వెంకటపతి మృతి చెందారు. వడదెబ్బతో వీరు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. తీవ్ర వడగాలులకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.