Andhra Pradesh

News May 5, 2024

నేడు జమ్మలమడుగుకు కేంద్ర మంత్రి.. ఏర్పాట్లు పూర్తి

image

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ నేడు కడప జిల్లాకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగు కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పోలీసు అధికారులు పరిశీలించారు. ఇప్పటికే పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను సంబంధించి నాయకులు పూర్తి చేశారు.

News May 5, 2024

గుంటూరు రైల్వే డివిజన్లో నిలిచిన పలు రైళ్లు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్గొండ-పగిడిపల్లి మార్గంలో శనివారం పలు రైళ్లు నిలిచిపోయాయి. చెన్నై ఎక్స్ ప్రెస్(12603), సికింద్రాబాద్ నుంచి వస్తున్న ప్రత్యేక రైలు(00632)కు విద్యుత్తు సరఫరా అయ్యే పాంటూలు (మెయిన్ లైన్ నుంచి రైలుకు విద్యుత్ సరఫరా చేసే పరికరం) విరిగిపోవడంతో.. విష్ణుపురం స్టేషన్లో అకస్మాత్తుగా ఆగిపోయాయి. విరిగిన పరికరాలను బాగు చేసిన తర్వాత ఆ రైళ్లు అక్కడి నుంచి కదిలాయి.

News May 5, 2024

నీట్-2024కు ఆరు కేంద్రాల్లో ఏర్పాట్లు

image

ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశనిమిత్తం నీట్-2024ను ఆదివారం నిర్వహించనున్నారు. జిల్లాలోని అక్షర విద్యాలయం, వీఆర్ ఐపీఎస్, కోవూరు గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల, కావలి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, తడలోని పద్మావతి సీబీఎస్ఈ, గూడూరు శ్రీచైతన్య స్కూలులో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యే పరీక్షకు 4500 మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.

News May 5, 2024

శ్రీకాకుళం: దివ్యాంగ ఓటర్లు 21,481 మంది

image

శ్రీకాకుళం జిల్లాలో దివ్యంగా ఓటర్లు 21,481 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 31,44 మంది, అత్యల్పంగా ఆముదాలవలస నియోజకవర్గంలో 2,255 ఉన్నారు. శ్రీకాకుళంలో 2,724, నరసన్నపేటలో 2,981, టెక్కలి 2,649, పాతపట్నం 2,380, పలాస 2,573, ఇచ్చాపురం 2,775 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

News May 5, 2024

ప.గో.: 50 ఏళ్లుగా.. ఆ 2 కుటుంబాలదే హవా

image

నరసాపురం నియోజకవర్గంలో 50 ఏళ్లుగా రాజకీయం అంతా కొత్తపల్లి సుబ్బారాయుడు, పరకాల శేషావతారం కుటుంబాలదే నడిచింది. 1967 నుంచి 82 వరకు 3 సార్లు MLA అయి పరకాల కీలకంగా వ్యవహరించగా.. ఆయన మరణానంతరం 1994 వరకు ఆయన సతీమణి, కొడుకు ప్రభాకర్ ఉన్నారు. 94లో జరిగిన ఎన్నికల్లో కొత్తపల్లి గెలుపుతో పరకాల కుటుంబ రాజకీయం నియోజకవర్గంలో కొంత తగ్గింది. 2009 వరకు కొత్తపల్లి హవా కొనసాగింది. ఇప్పటికీ ఆయనకు ప్రత్యేకస్థానం ఉంది.

News May 5, 2024

వలసదారులకు ఓటు వేయవద్దు: మాండ్ర

image

ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఇతర పట్టణాల నుంచి వచ్చి నందికొట్కూరు నుంచి పోటీచేసే వైసీపీ వలస దారుడైన అభ్యర్థికి ఓటు వేయవద్దని నిత్యం ప్రజల మధ్యనే ఉండే టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్యకు ఓటువేసి గెలిపించాలని నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలోని శివపురం, లింగాపురం, గోకవరం, ఎదురుపాడు, జడ్వారి పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

News May 5, 2024

శ్రీకాకుళం: మరో 7 రోజులే.. ఇక వారి ఓట్లే టార్గెట్!

image

పోలింగ్ తేదీ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ప్రతి ఓటు కీలకమేనంటూ టెక్కలి ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తూ వారితో టచ్‌లో ఉంటున్నారు. పోలింగ్ రోజు ఓటేసేలా రైల్వే, RTC, ప్రైవేటు బస్సులకు ప్యాకేజీలు మాట్లాడుతున్నట్లు సమాచారం.

News May 5, 2024

తూ.గో.: 10th ఫెయిల్.. విద్యార్థిని SUICIDE

image

బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన తూ.గో జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వనలక్ష్మి (15) ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు నల్లజర్ల ఏఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 5, 2024

కొండపి ఎమ్మెల్యే స్వామికి స్వల్ప ప్రమాదం

image

కొండపి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణ సంచా పేల్చగా నిప్పు రవ్వలు ఎమ్మెల్యే స్వామి కంటికి తగిలాయి. దీంతో ఆయనను ఒంగోలులో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

News May 5, 2024

మడకశిరలో కాంగ్రెస్ గట్టిపోటీ.. త్రిముఖ పోరులో నెగ్గేదెవరో?

image

జిల్లాలో ఎక్కడా లేనట్లు మడకశిర నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ నుంచి ఎంఎస్ రాజు, వైసీపీ నుంచి ఈర లక్కప్ప బరిలో బరిలో ఉండగా.. వీరికి కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్ గట్టిపోటీ ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మంచి పట్టున్న మాజీమంత్రి రఘువీరారెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడం ఆ పార్టీకి ప్లస్‌గా మారింది. చూడాలి ‘మడకశిర’ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు నెగ్గుతారో?