India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పామర్రు మండల పరిధిలో నిమ్మకురు బెల్ కంపెనీ సమీపంలో గల పంట పొలాల్లో, గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఎస్ఐ ప్రతాప్ ఆదివారం తెలిపారు. మృతదేహం ఒంటి మీద ఎరుపు రంగు చీర ధరించి, సుమారు (50) వయస్సు ఉంటుందని అన్నారు. మహిళా మిస్సింగ్ కేసులు పెట్టినవారు ఉంటే పామర్రు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
ఏపీలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో TDP అధినేత ఎన్నికల సమరానికి సై అంటున్నారు.ఇందులో భాగంగా ప్రజాగళం పేరుతో కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలంలో ఈనెల 29న చంద్రబాబు రోడ్ షోలో పాల్గొననున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
కొత్తచెరువులో ఆదివారం తెల్లవారుజామున చికెన్ వ్యాపారి ఉప్పు చలపతి కిడ్నాప్ కలకలం రేపింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు గుర్తు తెలియని దుండగులు చలపతిని ఆయన ఇంటి నుంచి కారులో కిడ్నాప్ చేశారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ పుటేజ్ ఆధారంగా కిడ్నాప్ ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చలపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారు. తిరుపతి సీటుపైనే స్తబ్దత నెలకొంది. చిత్తూరు MLA శ్రీనివాసులును తిరుపతి అభ్యర్థిగా ప్రతిపాదించగా జనసేనతో పాటు TDP నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నిన్న జనసేన నాయకులు నాగబాబును కలిసి చర్చించారు. లోకల్‌గా ఉన్న తనతో పాటు TDPలోని ఇద్దరు నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పని చేస్తామని తిరుపతిలో కీలకంగా ఉన్న జనసేన నాయకుడు చెప్పినట్లు సమాచారం.
ఉమ్మడి తూ.గో 21 నియోజకవర్గాల్లో TDP-జనసేన-BJP కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ 15, జనసేన 6చోట్ల పోటీ చేస్తుండగా.. BJP నుంచి ఎవరూ లేరు. పి.గన్నవరం టికెట్ ముందుగా TDPకి కేటాయించగా.. కొన్ని పరిణామాలతో జనసేనకు వెళ్లింది. వైసీపీ కూడా ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో నేతలంతా ఇక ప్రచారం రంగంలోకి దిగనున్నారు. ‘కూటమి’ Vs వైసీపీగా మారిన ఈ పోటీలో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి.
బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి ఓ సైబర్ కేటుగాడు డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. ఇంద్రప్రస్థకు చెందిన బదులు వెంకటేశ్వరప్రసాద్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. బ్యాంక్ అధికారినంటూ నమ్మబలికాడు. క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలంటూ వివరాలు తెలుసుకొని వెంకటేశ్వరప్రసాద్ ఖాతాలోంచి రూ.92,650 కాజేశాడు. వెంటనే బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అదితి గజపతిరాజు, బేబీ నాయన, కొండపల్లి శ్రీనివాస్ శనివారం విజయవాడలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేనతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మికి వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి లభించింది. ఆమె ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మికి ఆడిషనల్ డైరెక్టర్ (స్పెషల్) హోదా కల్పిస్తూ ఇక్కడే పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న DMHO పోస్టును అప్‌గ్రేడ్ చేసి ఇక్కడే కొనసాగే విధంగా వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో తెలిపారు.
30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుత్తికి రానున్నట్లు వైసీపీ గుత్తి పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా ఆదివారం తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి 30వ తేదీన గుత్తికి రానున్నారు. గుత్తిలో బస్సు యాత్ర ముగిసిన తర్వాత కడప జిల్లా పులివెందులకు తరలి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తాంబరం (తమిళనాడు), సత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 26, ఏప్రిల్ 2వ తేదీల్లో తాంబరం- సత్రాగచ్చి (నెం.06079), ఈ నెల 27, ఏప్రిల్ 3వ తేదీన సత్రాగచ్చి- తాంబరం (నెం.06080) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, విజయనగరం, ఒంగోలుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.