Andhra Pradesh

News May 5, 2024

కడప: ‘భద్రతా నిఘా చర్యలను పటిష్టం చేయాలి’

image

వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే పోలీసు భద్రతా, నిఘా చర్యలను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. కర్నూలు రేంజ్ డీఐజీ విజయ్ రావు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కునాల్ సిల్కు సమావేశం నిర్వహించారు.

News May 4, 2024

తిరుపతి : MPED ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో MPED మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News May 4, 2024

VZM: నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలుఇవే

image

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు ఫెసిలిటేషన్ కేంద్రాలను అధికారులు కేటాయించారు. రాజాం- (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, RTC కాంప్లెక్స్ దరి), బొబ్బిలి-(మున్సిపల్ పాఠశాల గొల్లపల్లి), చీపురుపల్లి-( శ్రీరామ్ జూనియర్ కాలేజ్, SDS కాలేజ్), గజపతినగరం-(బాలికల ఉన్నత పాఠశాల, పురిటిపెంట), నెల్లిమర్ల-(CKMకాలేజ్, MIMS పక్కన), విజయనగరం-(JNTU), శృంగవరపుకోట -(ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఎస్ కోట)లో ఏర్పాటు చేశారు.

News May 4, 2024

పల్నాడు: సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్

image

పల్నాడు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీటిలో గురజాల, వినుకొండ, పెదకూరపాడు, మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున ప్రత్యేక సీఆర్పిఎఫ్ బలగాలు అదనంగా ఉంటాయన్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది.

News May 4, 2024

కృష్ణాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొన్న 3,361 మంది

image

కృష్ణా జిల్లాలో తొలి రోజు 3361 మంది పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 3,728 మందికి గానూ సాయంత్రం 5 గంటలకు వరకు అందిన సమాచారం మేరకు 3,361 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. గన్నవరంలో 299, గుడివాడలో 490, పెడనలో 212, మచిలీపట్నంలో 783, అవనిగడ్డలో 843, పామర్రులో 246, పెనమలూరులో 488 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు.

News May 4, 2024

పొదిలి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

పొదిలి మండలం కంబాలపాడు గ్రామ సమీపంలోని సచివాలయం దగ్గరలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని స్థానికులు గుర్తించి పొదిలి పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కోటయ్య మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

రేపు పిఠాపురానికి మెగా హీరో.. రూట్ మ్యాప్ ఇదే

image

తన మావయ్య పవన్‌ను గెలిపించాలంటూ హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం (రేపు) పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదలైంది. పాత కండ్రవాడ , కొత్త కండ్రవాడ, చిత్రాడ, తాటిపర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో ప్రచారం సాయిధరమ్ తేజ్ ప్రచారం చేయనున్నట్లు జనసేన నేతలు ప్రకటించారు. 

News May 4, 2024

పరామర్శకు వెళితే దాడి చేశారు: సీఎం రమేశ్

image

తనపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయని అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేవరాపల్లి మండలంలోని తారువలో మా పార్టీ కార్యకర్తపై దాడి జరిగితే, పరామర్శించడానికి వెళ్లిన నాపై వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. అక్కడే చోద్యం చూస్తున్న పోలీసులు, వారి వాహనాలపై కూడా దాడికి దిగారు. ఈ దాడికి స్వయంగా YCP ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడే నేతృత్వం వహించడం దారుణం’ అని ట్వీట్ చేశారు.

News May 4, 2024

ఎస్ పేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఎస్ పేట సమీపాన హసనాపురం రోడ్డుపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీకొని సంగం మండలం తెర మన గ్రామానికి చెందిన తుమ్మల శివ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహేశ్‌ను 108 వాహనంలో ఆత్మకూరు ఆసుపత్రి చికిత్స కోసం తరలించారు.

News May 4, 2024

‘తిరుపతి అభ్యర్థులందరూ వైసీపీకి చెందిన వారే’

image

తిరుపతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ వైసీపీకి చెందిన వారేనని, 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి తీర్పు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.మురళిని గెలిపించాలని కోరుతూ తిరుపతిలో శనివారం రోడ్ షో నిర్వహించారు. మొదట బాలాజీ కాలనీలోని జ్యోతి రావ్ ఫూలే విగ్రహానికి పూలమాల వేశారు.