India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తర్లుపాడు మండలం నాగేళ్లముడుపులో బీరపోగు సామ్రాజ్యం అనే వృద్ధురాలు మండుతున్న ఎండలు వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సుబ్బమ్మ వృద్ధురాలి మృతదేహానికి నివాళులర్పించారు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న సామ్రాజ్యం ఒకసారిగా స్పృహ కోల్పోయి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రముఖ సినీ నిర్మాత, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన మిత్ర బృందం ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన శనివారం నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డితో ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను చర్చించారు.
చెడు వ్యసనాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాడంగి మండలంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ బీ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కోటిపల్లి గ్రామానికి చెందిన బోను వెంకటరమణ(21) తాగుడు, బెట్టింగ్‌కు అలవాటు పడినట్లు తెలిపారు. జీవితంపై విరక్తి చెంది శనివారం డొంకినవలస ఎత్తు బ్రిడ్జి సమీపంలో రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.
హిందూపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బాలాజీ మనోహర్ శనివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. సిధ్ధం సభ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ మనోహర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని, భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.
పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీలు పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక పీవికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 5,6 తేదీలలో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రానికి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా.. అందులో 45 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తెలిపారు. వివిధ కేటగిరీల కింద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 18 వరకు నమోదు చేశామన్నారు. అందులో 6 కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్ పరిధి పాతూరు రైల్వే గేట్ వద్ద శనివారం ఓ వ్యక్తి రైలు నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయాడు. తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ నరసింహారావు తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని స్పష్టం చేశారు.
సీఎం జగన్ ఈ నెల 6న మాచర్లలో పర్యటించనున్నట్లు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి శనివారం తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం వస్తున్నారని చెప్పారు. ఈ సభలో కార్యకర్తలు, నాయకులు విచ్చేసి సభను జయప్రదం చేయాలని కోరారు.
గూడూరు మండలం చెంబడిపాళెం దళితవాడకు చెందిన పల్లిపాటి గురవయ్య (45) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడు కూలి పనుల కోసం చెన్నూరు గ్రామానికి పోయి పనిచేస్తుండగా ఒకసారిగా స్పృహ తప్పి పడిపోయాడని బంధువులు తెలిపారు. అతనిని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. మృతునికి భార్య బిడ్డలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘ రోగాలు గల వారి పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. భానుడి ప్రతాపంతో ఆమదాలవలస మండల పరిధిలో ప్రధాన రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం ఎండలో బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.