Andhra Pradesh

News May 4, 2024

రేపు అంగళ్లుకు చంద్రబాబు రాక

image

కురబలకోట మండలం అంగళ్లులో ఆదివారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా మిట్స్ కాలేజీ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ స్థలాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త మల్లికార్జున పరిశీలించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు.

News May 4, 2024

తిరుపతి: PG కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ (PG) ఆచార్య, ఎంఏ శబ్ద బోధ, ఎంఏ హిందీ, ఎమ్మెస్సీ యోగ థెరపి, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమశ్రీ పేర్కొన్నారు. CUET ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://nsktu.ac.in వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.

News May 4, 2024

కాళ్ళ: అధికారంలోకి రాగానే పరిష్కారం: RRR

image

కాళ్ళ మండలం కలవపూడి గ్రామంలో శనివారం ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘు రామకృష్ణరాజు స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి గెలుపునకు సహకరించాలని ప్రజలను అభ్యర్థించారు.   

News May 4, 2024

రేపల్లె చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆయన రేపల్లెలో జరగనున్న సభా ప్రాంగణం వద్దకు బయలుదేరారు.

News May 4, 2024

ఖాజీపేట: వడదెబ్బతో మాజీ సర్పంచ్ మృతి

image

మిడుతూరు పంచాయితీ కి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డవాండ్ల వెంకటపతి (75) వడదెబ్బతో మృతిచెందారు. గ్రామస్థులు, బంధువుల వివరాల మేరకు.. ఎండలు ఎక్కువగా వున్న క్రమంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య ఎర్రక్కతో పాటు కుమారుడు అంకయ్య ఉన్నాడన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు శ్రీనువాసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంతాపం తెలిపారు. వెంకటపతి మరణం కుటుంబానికి తీరని లోటన్నారు. 

News May 4, 2024

తూ.గో: విషాదం.. వడదెబ్బతో ఇద్దరు మృతి

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. వడదెబ్బకు వ్యక్తులు పిట్టల్లా రాలుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన ఉపాధిహామీ కూలీ చెరుకూరి సాహెబ్(68) శనివారం ఉదయం పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మారేడుమిల్లి మండలం పుల్లంగికి చెందిన కోర కాంతయ్య అనే వృద్ధుడు సైతం వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు.

News May 4, 2024

శ్రీకాకుళం: ఆ ఛానెల్‌లో వచ్చిన వార్త అవాస్తవం

image

శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు శనివారం వెల్లడించారు. మూడు రోజులు పాటు 8 నియోజకవర్గ కేంద్రాల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉద్యోగులు వేచి ఉన్నట్లు తెలిపారు. ఓ ఛానల్‌లో నరసన్నపేటపై వచ్చిన వ్యతిరేక వార్త వాస్తవం కాదని సాఫీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతుందని ఆర్వో రామ్మోహన్ స్పష్టం చేశారు.

News May 4, 2024

VZM: సరిగ్గా నెలరోజులు.. మీ MLA ఎవరు?

image

సరిగ్గా మరో నెల రోజుల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగా.. మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లు లెక్కించి ఎమ్మెల్యే ఎవరో ప్రకటిస్తారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరంలోని 9 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్ చెయ్యండి.

News May 4, 2024

విశాఖ: ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 6న అనకాపల్లికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కశింకోట మండలం తాళ్ళపాలెంలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సభ ఉంటుందని వెల్లడించారు. సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలిపారు.

News May 4, 2024

ఏర్పేడు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్‌కు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్సాలజీ (IIT) తిరుపతి నందు అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్ట్-01కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోసైన్స్, డిప్లమా ఇన్ హార్టికల్చర్/అగ్రికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 13.