India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వివిద రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు, ప్రజలు అందరూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమి ఆదేశించారు. ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి రాయదుర్గంలో ఆమె పర్యటించారు. జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీకి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ జరిగిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఎక్కడా లోపం లేకుండా పనులు నిర్వహించాలన్నారు.
ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్‌ను విధుల నుండి తొలగించామని తెలిపారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన నిర్వహించారు. వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్సై షేక్షావల్లి, టూ టౌన్ సిఐ ఉలసయ్య , ఎస్సై ప్రసాద్ పోలీసు సిబ్బంది నగరంలోని పలు ప్రధాన క్రీడలలో కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో గొడవలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
అనకాపల్లి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికల గ్రీవెన్స్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమాండ్ కంట్రోల్ కేంద్రం నోడల్ అధికారి, మత్సశాఖ డి.డి పి.ప్రసాదు తెలిపారు. అలాగే ఇప్పటికే అందుబాటులో వున్న టోల్ ఫ్రీ నం.1950 కూడా అందుబాటులో వుంటుందని చెప్పారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి గ్రీవెన్స్ తెలియజేయడానికి 24 గంటలు అందుబాటులో వుంటుందని తెలిపారు.
గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కన్వీనర్ జి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గండిపాలెం(బాలురు), నెల్లూరు(బాలురు), ఆత్మకూరు(బాలికలు), తుమ్మలపెంట (బాలికలు) లో 5 వ తరగతి, 6,7,8 తరగతులలో మిగిలిన ఉన్న ఖాళీలభర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 31వ తేదీలోపు https://aprs.apcfss.in లో దరఖాస్తుచేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా శనివారం గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో, భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిరంగిపురంలో వీవీ ప్యాట్‌లను కూడా పరిశీలించారు.
ఎన్నికలలో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పిలుపు నిచ్చారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో శనివారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు.
విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఈనెల 31, వచ్చేనెల 3న నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్ లైన్‌లో విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. 27 నుంచి పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ ఢిల్లీ క్యాపిటల్స్ వెబ్సైట్లో ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. పీఎం పాలెం స్టేడియం బి గ్రౌండ్, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో రెడీమ్ చేసుకోవచ్చునని చెప్పింది.
అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ అన్‌షోర్ టెర్మినల్‌లో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటరమణారావు(55) శనివారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబీకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. టాటా సంస్థలో స్టోర్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న రమణారావు కి.మీ దూరం నడిచి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్నారు. బెండమూర్లంక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందారన్నారు.
Sorry, no posts matched your criteria.