Andhra Pradesh

News May 4, 2024

తాడేపల్లి బైపాస్‌లో డ్రగ్స్ కలకలం

image

తాడేపల్లి బైపాస్‌లో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ కాలేజీ విద్యార్థుల నుంచి రూ.5 లక్షల విలువైన 80 గ్రాముల డ్రగ్స్‌ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ కలిగి ఉన్న విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం జౌకల గ్రామంలో ఓ వ్యక్తిని దారుణ హత్య చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నాగభూషణం(38) అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా దాడిచేసి హత్య చేశారు. శనివారం ఉదయం గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కదిరి పోలీసులు తెలిపారు.

News May 4, 2024

శ్రీకాకుళం: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామ సమీపంలో శనివారం ఉదయం 8గంటల సమయంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.మృతి చెందిన వ్యక్తి పాలవలస గ్రామ వాసి అని.. సుమారు 46-50సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News May 4, 2024

రాజాo: నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

నేడు పీవో, ఏపీవో, సూక్ష్మ పరిశీలకులు, పోలీసు సిబ్బంది ఓటు వేస్తారు. 5న ఓపీవో , సెక్టార్ అధికారులు, కంట్రోల్ రూం సిబ్బంది, ఇతర బృందాల్లో విధులు నిర్వహిస్తున్న వారు, 6 తేదీన పోలీసు, ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉన్న వీడియోగ్రాఫర్లు, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మాజీ సైనికులు, ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటు వేస్తారు. 7తేదీన (రిజర్వ్ డే) మరో అవకాశం ఉంటుంది.

News May 4, 2024

నేడు గుడివాడకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

image

నేడు గుడివాడ నియోజకవర్గంలోని నెహ్రూ చౌక్‌లో ఉదయం 11 గంటలకు రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News May 4, 2024

సంగం-ముంబై హైవేపై రోడ్డు ప్రమాదం 

image

సంగం మండలం దువ్వూరు సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం రాత్రి ముంబై రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచి వెళుతున్న ఓ వ్యక్తిని నెల్లూరు వైపు వెళుతున్న బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఇరువురుకి తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై నాగార్జున రెడ్డి క్షతగాత్రులను హైవే అంబులెన్సులో నెల్లూరుకు తరలించారు.

News May 4, 2024

రేపు కర్నూలు జిల్లాకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఎన్నికల ప్రచారానికి ఆదోనికి రానున్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాఫ్టర్‌ ద్వారా చేరుకుంటారు. ఆర్ట్స్ కళాశాల నుంచి తిక్కస్వామి దర్గా మీదుగా భీమాస్ సర్కిల్ నుంచి కోట్ల కూడలి వరకు ప్రచార రథంలో రోడ్ షో నిర్వహిస్తారు. బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

News May 4, 2024

విజయనగరం జిల్లాలో మహిళలే మహా రాణులు..!

image

ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మహిళల ఓట్లే కీలకంగా మారనున్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 15,62,921 మంది ఉన్నారు. వీరిలో అధికంగా మహిళా ఓటర్లు 7,92,038 మంది ఉండడంతో అభ్యర్థుల గెలుపులో వీరంతా కీలకంగా మారనున్నారు. మహిళలు ఎక్కువ శాతం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ దగ్గర పడుతుండడంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడంలో అభ్యర్థులు బిజీ బిజీగా ఉన్నారు.

News May 4, 2024

సింహాచలంలో గంధం అరగదీత ప్రారంభం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం సంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించారు. తొలి విడత అప్పన్న బాబుకు సమర్పించడానికి అవసరమైన 120 కిలోల గంధాన్ని అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. చందనోత్సవ రోజున ఈ గంధాన్ని సింహాద్రిఅప్పన్నకు సమర్పిస్తారు.

News May 4, 2024

సింహాచలంలో గంధం అరగదీత ప్రారంభం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవానికి ఆలయంలో గంధం అరగదీతను ఆలయ అర్చకులు వేద పండితులు శనివారం ఉదయం సంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించారు. తొలి విడత అప్పన్న బాబుకు సమర్పించడానికి అవసరమైన 120 కిలోల గంధాన్ని అరగదీసి దానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. చందనోత్సవ రోజున ఈ గంధాన్ని సింహాద్రి అప్పన్నకు సమర్పిస్తారు.