India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పి.గన్నవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ఈ ఏడాది జనవరి 31న స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. పి.గన్నవరం మండలం ఉడిమూడికి చెందిన సత్యనారాయణ సీఆర్ రెడ్డి కళాశాలలో బీఏ, బీఎల్ చదివారు. 1961 మే 15న జన్మించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరి పి.గన్నవరం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప MLA అభ్యర్థిగా రెడ్డప్పగారి మాధవి రెడ్డిని అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. YCP సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో ఆమె ఆమె తలపడనున్నారు. ఈమె ప్రస్తుతం కడపలో నివశిస్తున్నా.. సొంత ఊరు నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామం అని తెలిపారు. ఈమె భర్త కడప టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి.
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శనివారం ఉదయం రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలోని ప్రధాన రహదారిలో హోటల్ నిర్వాహకుడు దామోదర్ ఈరోజు ఉదయం బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొని తలకు తీవ్ర గాయమై మృతిచెందాడు. మృతుడు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. భౌతికశాస్త్రం పరీక్షలకు మొత్తం 25256 విద్యార్థులు హాజరయ్యారు. 826 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి ఫిర్యాదులు అందలేదన్నారు. జిల్లా మొత్తం భౌతిక శాస్త్రం పరీక్ష సజావుగా జరిగిందన్నారు. మొత్తం హాజరు శాతం 96.83 నమోదు అయిందన్నారు.
భీమవరం నియోజకవర్గానికి 1955, 1962లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాచు వెంకట్రామయ్య కాంగ్రెస్ తరఫున వరుస విజయాలు సాధించారు. 1967లో సైతం కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్థిగా బి.విజయ్ కుమార్ రాజు పోటీలో నిలిచి 9207 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో వెంకట్రామయ్య హ్యాట్రిక్ విజయానికి అడ్డుపడింది. 1972 నాటికి విజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరి మరోసారి విజయం సాధించారు.
కర్నూలుకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అదే జిల్లాలోని గోనెగండ్ల మండలంలో ఆయన పని చేసేవాడు. ఇటీవలె ఆయన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్థాపానికి గురై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో శనివారం పలువురు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గొండు శంకర్, కూన రవికుమార్, గౌతు శిరీష, బెందాళం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
విజయవాడ వెస్ట్ టికెట్ జలీల్ ఖాన్‌కు కేటాయించాలని మైనార్టీలు నిరసనకు దిగారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో టీడీపీ వర్క్ షాపుకు చంద్రబాబు హాజరవ్వగా, ఆయన కాన్వాయ్‌ను జలీల్ ఖాన్ వర్గం అడ్డుకునేందుకు యత్నించారు. పొత్తులో వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుందని, అయితే టికెట్ జలీల్ ఖాన్‌కు ఇవ్వాలని నిరసన తెలిపినట్లు సమాచారం.
సమాచార శాఖ ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కృష్ణా జిల్లా I&PR DD వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా మంత్రుల పేషీల్లో పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న పీఆర్ఓలు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు మాత్రమే ఆ మెమో వర్తిస్తుందన్నారు. ఈ మేరకు ఉదయం విడుదల చేసిన ప్రెస్ నోట్‌ను అధికారులు సవరించారు.
అనంతపురం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గౌతమి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి అనంతపురం అర్బన్‌కి వెంకటేష్, రాప్తాడుకి వసంతబాబు, ఉరవకొండకి కేతన్ గార్గ్, రాయదుర్గానికి కరుణకుమారి, శింగనమలకి వెన్నెల శ్రీను, తాడిపత్రికి రాంభూపాల్ రెడ్డి, కళ్యాణదుర్గంకి రాణి సుష్మిత, గుంతకల్లుకి శ్రీనివాసులు రెడ్డిలను నియమించారు.
Sorry, no posts matched your criteria.