Andhra Pradesh

News May 4, 2024

గుంటూరులో ఈ నెల 5న నీట్ పరీక్ష 

image

వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ పరీక్ష ఈనెల 5న ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు 4,089 మంది విద్యార్థులు హాజరవుతుండగా, గుంటూరులో 7 పొన్నూరులో ఒక కేంద్రంలో పరీక్ష జరగనుంది. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుందని, మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులను అనుమతించనున్నట్లు తెలిపారు. 

News May 4, 2024

ద్వారకాతిరుమల: శ్రీవారి సేవాటికెట్ల రుసుముల పెంపు

image

ద్వారకాతిరుమల శ్రీవారి సేవాటికెట్ల రుసుములను పెంచినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. సుప్రభాత సేవా టికెట్ రుసుము రూ.200 నుంచి రూ.300, అష్టోత్తరం శతనామార్చన రూ.300 నుంచి రూ.500, దీపారాధన సేవ రూ.10 నుంచి రూ.20లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

News May 4, 2024

పలాస: వంతెనపై వేలాడుతున్న లారీ

image

పలాస మండలం లక్ష్మీపురం సమీపంలో అర్ధరాత్రి దాటిన వేళ జాతీయ రహదారిపై ఓ లారీ అదుపు తప్పి వంతెన గోడను ఢీకొని వేలాడుతూ ఆగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి డ్రైవర్ సర్వీస్ రోడ్లోకి ఎగిరి పడటంతో గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలం చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News May 4, 2024

వెంకటాచలం: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

వెంకటాచలం మండలంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఢీకొని వెంకటాచలం రైల్వేగేటు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి (55) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. 

News May 4, 2024

సంబేపల్లె: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

సంబేపల్లె మండలంలోని దేవపట్ల ఆవుల వాండ్లపల్లెకు చెందిన షేక్ నౌజియా అనే డిగ్రీ విద్యార్థిని (19) శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆవులవాండ్లపల్లెకు చెందిన షేక్ మస్తాన్, హజీరా దంపతుల కుమార్తె ఎస్.నౌజియా రాయచోటిలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు.

News May 4, 2024

పరవాడలో రసాయనాలు లీక్.. ఐదుగురికి అస్వస్థత

image

పరవాడ రామ్‌కి ఎస్‌ఈ జెడ్‌లోని అజీనో మోటో బయో ఫార్మా కంపెనీలో రసాయన వాయువు లీకై ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి పరవాడ సీఐ ఎం.బాలసూర్యరావు తెలిపిన వివరాలు ఉన్నాయి. ఫార్మా పరిసర గ్రామాలకు చెందిన 5 వ్యక్తులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత గొంతులో నొప్పి ప్రారంభమైంది. దీంతో కుటుంబ సభ్యులు సంస్థ యాజమాన్యానికి సమాచారం అందించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు.

News May 4, 2024

తూ.గో.: ఘోరం.. గోదావరిలో మునిగి మరో ఇద్దరు మృతి

image

సీతపల్లి వాగులో మునిగి సామర్లకోటకు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మరువక ముందే కోనసీమ జిల్లాలో మరోఇద్దరు యువకులు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం వానపల్లికి చెందిన ఆరుగురు యువకులు కపిలేశ్వరపురం మండలం నారాయణలంక వెళ్లారు. కాసేపు క్రికెట్ ఆడిన తర్వాత గోదావరిలో స్నానానికి దిగారు. నాగసతీష్(23), ప్రసన్నకుమార్(25) మునిగిపోగా స్థానికులు బయటకు తీశారు. అప్పటికే వారు మృతిచెందారు.

News May 4, 2024

గుంటూరు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు

image

జిల్లాలో శుక్రవారం ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు పశ్చిమ పరిధిలో రూ.2 లక్షలు, తాడికొండ పరిధిలో రూ.1,28,500ల నగదు సీజ్ చేశామన్నారు. గుంటూరు తూర్పు పరిధిలో 3.75లీటర్ల మద్యం, తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.70,300ల నగదు జప్తు చేశామన్నారు. జిల్లాలో మే 3వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,79,46,507ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు.

News May 4, 2024

కృష్ణా: నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్

image

జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సులభతరంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

News May 4, 2024

సత్యసాయి జిల్లాలో 1,211 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,211 ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర నియోజకవర్గాల నుంచి సివిల్ సప్లై, హోంగార్డ్, పోలీస్, రైల్వే, ఆర్టీసీ, వైద్యం, సెబ్, పౌర సంబంధాల శాఖ, విద్యుత్, ఆర్టీవో, ప్రెస్, అగ్నిమాపక శాఖల నుంచి 1,211 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.