Andhra Pradesh

News May 4, 2024

చందనోత్సవంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత: కలెక్టర్

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరిగే చందనోత్సవంలో సామాన్య భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఆలయంలో చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్, కమిషనర్, ఏసీపీ ఫకీరప్ప సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపాథ్యంలో ప్రోటోకాల్ దర్శనాలు ఉండవన్నారు.

News May 4, 2024

కడప: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

image

చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాలివీడు మండలంలోని ప్రకాశ్ నగర్ కాలనీకి చెందిన నాగశేషు (23) తన మిత్రులతో కలిసి చేపలు పట్టడానికి కాలనీ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు సాయంత్రం వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో నీటిలో పడి మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటప్రసాద్ పేర్కొన్నారు.

News May 4, 2024

ఏలూరు: తల్లిని చంపాడు.. అరెస్ట్

image

తల్లిని చంపిన కేసులో కొడుకు అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు నగరంలోని పడమరవీధి దొంగల మండపం ప్రాంతానికి చెందిన డొక్కు కృష్ణవేణికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కాగా ఈ నెల 1వ తేదీన కుమారుడు హరికృష్ణ మద్యానికి డబ్బులు కావాని తల్లిని అడిగాడు. లేవని చెప్పగా గొడవపడి ఆమె తలను గోడకు కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. కేసు నమోదుచేసిన సీఐ రాజశేఖర్ శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశాడు.

News May 4, 2024

లావేరు: మనస్తాపానికి గురై యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురై యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన లావేరు మండలం కలవలస గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొంగం సాయి కోటి(38) మనస్తాపంతో పురుగు మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా బంధువులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడని జే.ఆర్ పురం పోలీసులు తెలిపారు.

News May 4, 2024

నంద్యాల: మద్యం మత్తులో భార్యపై భర్త గొడ్డలితో దాడి

image

మద్యం మత్తులో గొడవపడి భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. కొత్తపల్లి మండలం శివపురానికి చెందిన అర్జున్.. అదే గ్రామానికి చెందిన మార్తమ్మను 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మద్యానికి బానిసైన అర్జున్ తరచూ తాగి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం మార్తమ్మపై దాడి చేయడంతో తల వెనుకభాగం, కుడిచేతి భుజం, మణికట్టు పైభాగం, మోచేతిపై తీవ్రగాయాలయ్యాయి.

News May 4, 2024

గుంటూరు: గిరిజన గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

తెనాలి, గుంటూరులో నడుస్తున్న మూడు ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర, బాలికల గురుకులాల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బండి విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 9 వ తరగతి వరకు గురుకులాల వారీగా ఉన్న ఖాళీల వివరాలను ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు గురుకులాల్లో సంప్రదించాలన్నారు.

News May 4, 2024

పలమనేరులో నేడు సీఎం జగన్ పర్యటన

image

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలమనేరుకు రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన గంగవరం సమీపంలోని యూనివర్సల్ మైదానానికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అనంతరం బస్సులో పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్దకు చేరుకుని బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 4, 2024

కృష్ణా: పోలింగ్‌కు 48 గంటల ముందే మద్యం షాపులు బంద్

image

ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు జిల్లాలోని అన్ని మద్యం షాపులు మూసి వేయాలని, కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు రోజు అనగా జూన్ 4వ తేదీకి 48 గంటలు ముందు ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్ద డ్రై డే గా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

News May 4, 2024

ఒంగోలు: టెన్త్ మార్కుల జాబితాలు సిద్ధం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పొట్టి మార్కుల జాబితాను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ లో సిద్ధంగా ఉన్నట్లుగా డీఈఓ సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వెబ్‌సైట్ నుంచి మార్కుల జాబితాలు డౌన్‌లోడ్ చేసి ప్రధానోపాధ్యాయులు అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. ఈ మార్కులు జాబితాలతో విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందవచ్చన్నారు.

News May 4, 2024

తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బదిలీ

image

తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ బదిలీ అయ్యారు. ఈయన జిల్లా కలెక్టరేట్ విధుల్లో చేరనున్నారు. ఆయన స్థానంలో మున్సిపల్ ఇంజినీర్ డి.మురళీకృష్ణకు మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మురళి కృష్ణ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. శామ్యూల్ ఆకస్మిక బదిలీపై సర్వత్ర చర్చ సాగుతోంది.