India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ఎన్నికల కమీషన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్, పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను, పర్యవేక్షణను వివరించారు.
చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలకు ఇక ముగింపేనని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిగిరిలో మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు . 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఇప్పుడు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చామన్నారు.
బాపట్ల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బాపట్ల జిల్లా ఎన్నికల పరిశీలకులు పరిమళ సింగ్ చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎస్పీతో కలిసి భారత ఎన్నికల కమిషనర్ నితీశ్ వియాస్‌తో వీక్షణ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించామని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పరిశీలకులను నియమించామన్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో అనపర్తి నియోజకవర్గ ఓటర్ల నాడీ పట్టడం కష్టమే. ఇప్పటివరకు ఇక్కడ 15సార్లు ఎన్నికలు జరగ్గా.. సర్పంచ్‌లకు సైతం ఎమ్మెల్యేలుగా పట్టం కట్టి అసెంబ్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లది. 1971లో రామవరం సర్పంచ్‌గా గెలిచిన మూలారెడ్డి 1983లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే కాగా.. అనపర్తి సర్పంచ్‌గా గెలిచిన రామారెడ్డిని కాంగ్రెస్ తరఫున 1989, 2004లో ఎమ్మెల్యేగా గెలిపించారు.
సాధారణ ఎన్నికల సమయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు, సెబ్ అధికారులు, పోలీసు అధికారులు చిత్తశుద్ధితో సమర్థవంతంగా పనిచేయాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్. వి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లో ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు, డిపో మేనేజర్, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ లతో కలసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
బద్వేలు పట్టణంలోని 7వ వార్డు అమ్మవారిశాల వీధిలో ఉండే రామయ్య అనే వృద్ధుడు శుక్రవారం పెన్షన్ కోసం మీ సేవ వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న కాసేపటికి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే సురేంద్రనగర్ కు చెందిన నాగిపోగు ఎల్లమ్మ అనే మహిళ కూడా పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి తనకు అస్వస్థతగా ఉందంటూ కుటుంబ సభ్యులకు తెలిపిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు వారు తెలిపారు.
సికింద్రాబాద్ – బ్రహ్మపుర్ మధ్య వేసవి ప్రత్యేక రైలు మే 10న తేదీన నడుపుతున్నట్లు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. 11 న ఉదయం 9: 33 గంటలకు దువ్వాడ చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 2:45 గంటలకు బ్రహ్మ పూర్ చేరుకుంటుంది. మే 11న బ్రహ్మపూర్‌లో సాయంత్రం 4: 45 కు బయలుదేరి దువ్వాడకు రాత్రి 9: 55కు చేరుకుంటుంది. 12న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో శుక్రవారం జరిగింది. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు వివరాల మేరకు.. మదనపల్లె(M) బసినికొండకు చెందిన జగదీశ్ సెలవులు కావడంతో కాటిపేరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి బంధువులకు అప్పగించారు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్లు పంపిణీకి సిద్ధం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పత్రాలను ఇతర జిల్లాలకు, జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాల పంపిణీకి సిద్ధం చేస్తున్న ప్రక్రియను గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. నోడల్ అధికారులు శ్యాంసుందర్, రఘు పాల్గొన్నారు.
ఈ నెల 11వ తేదీ నాటికే పోలింగ్ కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు, నేమ్ బోర్డులతో సిద్ధంగా ఉంచాలని చెప్పారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ఎన్నికల అధికారులతో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.