India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సర్వేపల్లి రాజకీయం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా ఉంది. పాత ప్రత్యర్థులే తలపడుతున్నా కొత్త అంశాలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధి చేశానని, తననే గెలిపించాలని కాకాణి కోరుతుండగా.. కంటైనర్ టెర్మినల్, అక్రమ మైనింగ్ తదితర అంశాలను సోమిరెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. టీడీపీ హయాంలో తాను చాలా పనులు చేశానని, అన్నీ గమనించి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. అంతిమంగా సత్తా చాటేదెవరో.?
తిరుపతిలో విషాదకర ఘటన వెలుగు చూసింది. నగరంలోని తిరుమల నగర్, కృష్ణవేణి యాదవ్ కాలనీ డ్రైనేజీలో ఓ పురిటి బిడ్డ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత శిశువు పుట్టిందా లేక బిడ్డ పుట్టగానే డ్రైనేజీలో పడేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కూటమి ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారి వద్ద విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు సభ ఏర్పాట్లను శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ జగదీష్, ఎఎస్పీ అనిల్ కుమార్, జేసీ తేజ భరత్‌లు పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు అత్యధిక లబ్ధి చేకూరుతుందని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో కమలమ్మ చేరారు. కూటమి అభ్యర్థి విజయానికి విశేష కృషి చేస్తానని కమలమ్మ చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రితేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
అల్లూరి మన్యంలో పితూరి ఉద్యమంలో పాల్గొన్న మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం ఈతరొబ్బలు గ్రామానికి చెందిన పలాస సోములమ్మ గురువారం ఉదయం 8 గంటలకు మృతి చెందిందని తెలిపారు. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఎన్నో గ్రామాలు తిరిగిందని.. 1924లో పిండి కుండల పితూరిలో పాల్గొన్నట్లు చెప్పారు. సోములమ్మ వయసు సుమారు 130 ఏళ్లు ఉంటుదని వారు తెలిపారు.
ఈ నెల 1వ తేదీన బుధవారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి వేల్పనూరు రోడ్డు షోలో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రసగించారని ఎమ్మెల్యే తనయుడు శిల్పా కార్తీక్ రెడ్డి ఎన్నికల ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారని అన్నారు. మెజారిటీ తగ్గితే.. బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విశాఖపట్నం-హతియా నగరాల మధ్య నడుస్తున్న వారాంతపు వేసవి ప్రత్యేక రైలును జూన్ 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 30 వరకు విశాఖ నుంచి హతియా(08559) వెళ్లే రైలు, అదేవిధంగా హతియా నుంచి విశాఖకు(08560) వచ్చే రైళ్ళను మే 6 నుంచి జూన్ 1 రద్దు చేశారు. ప్రయాణికులు దీనిని గమనించాలని తెలిపారు.
మదనపల్లెలో రెడ్ల సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఇతర నాయకులకు ఫైనాపిల్ గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. స్థానిక రెడ్డి సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థులు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీకి మద్దతుగా నిలవాలని కోరారు.
ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ శరవేగంగా జరుగుతోంది. జిల్లాలోని 6 అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం కోసం 45,350 బ్యాలెట్ పత్రాల ముద్రణ కర్నూలు జిల్లా ప్రభుత్వ ప్రింటింగ్ కార్యాలయంలో జరుగుతోంది. శనివారం నాటికి బ్యాలెట్ పత్రాలు విశాఖకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాల ముద్రణ అంతా కర్నూల్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోనే జరుగుతుంది.
జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి కేసులో మచిలీపట్నం YCP MLA అభ్యర్థి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు మరో ఐదుగురు YCP నేతలపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కిట్టుని A1గా చూపగా చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్‌లను A2, A3, A4, A5గా చూపారు. ఇదే కేసులో కర్రి మహేశ్‌తో పాటు మరో ముగ్గురిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.