India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైవీయూ బీఈడీ, ఎంఈడీ 3 సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య చింతా సుధాకర్, కులసచివులు ఆచార్య వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డితో కలిసి తన ఛాంబర్ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలలో 84.58 శాతం, ఎంఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షల్లో 85.94 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
నకరికల్లు సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో నరసరావుపేట మండలం కేసానపల్లికి చెందిన ఏడుకొండలు మృతిచెందాడు. నకరికల్లు మండలం గుండ్లపల్లి నుంచి స్వగ్రామానికి వెళుతూ.. మార్గమధ్యంలో తేనె విక్రయిస్తున్న వ్యక్తితో మాట్లాడేందుకు బైకును రోడ్డు పక్కన ఆపిన క్రమంలో అటుగా వెళుతున్న క్రేన్ వాహనం అతనిని ఢీకొట్టింది. దీంతో అతను మృతిచెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధ తాళలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శింగరాయకొండలో బుధవారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీరామ్ కథనం మేరకు కుంచాల శ్రీకాంత్ అనే వ్యక్తి ఆటో తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెలావారీ ఫైనాన్స్ చెల్లించక పోవడంతో ఫైనాన్స్ సిబ్బంది ఆటోను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సదుం మండలం ఎర్రాతివారిపల్లె, పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ పర్యటనలో గొడవలు జరిగాయి. వీటిని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పలమనేరులోనూ వంద శాతం వెబ్‌కాస్టింగ్ చేస్తామన్నారు.
దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చెందిన మైలా ఏసన్న (53) అనే వ్యక్తి గురువారం వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఏసన్న ప్రొద్దుటూరులోని ఓ ఆయిల్ మిల్లులో కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గురువారం కూలి పనికి ప్రొద్దుటూరుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఏసన్న స్పృహ తప్పడంతో తోటి కూలీలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని డాక్టర్ పరీక్షించి మృతి చెందాడని తెలిపారు.
గుంటూరు మార్కెట్ యార్డుకు ఈనెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్ యార్డులోని కార్మిక సంఘాలు, దిగుమతి వ్యాపారుల సంఘం అభ్యర్థన మేరకు
వేసవి కాలంలో ఎండ తీవ్రత కారణంగా వేసవి సెలవులు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులు తమ సరుకును ఈనెల 10వ తేదీ వరకు మాత్రమే యార్డులోకి తీసుకురావాలన్నారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఈనెల 10న జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దర్శన టిక్కెట్లువిక్రయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి తెలిపారు.ఈనెల 7వ తేదీ సాయంత్రం వరకు విక్రయాలు సింహాచలం మహారాణిపేట అక్కయ్యపాలెం యూనియన్ బ్రాంచ్ లలో టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు.కొండపై కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
భీమిలి మండలం గొల్లల తాళ్లవలసలో ఈనెల 1వ తేదీన టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కొట్లాట సమాచారం మేరకు మధురవాడ జోన్ ఏసీపీ సునీల్, భీమిలి సీఐ డి.రమేష్ తదితరులు ఈనెల 1వ తేదీ రాత్రి నుంచి గ్రామంలో భద్రత ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం ఇరు వర్గాలకు చెందిన పదిమందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించే డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ థియరీ పరీక్షలను మే 13న ఎన్నికల నేపథ్యంలో కర్నూలు కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు సీఐ శ్రీరామ శ్రీనివాస్ వివరాల మేరకు.. ముంబయికి చెందిన లలిత్ కుమార్ సింఘాల్(57) చెన్నైలో పని చేస్తున్నారు. తన భార్య అంజూ శింఘాల్‌తో కలిసి కారులో శ్రీకాళహస్తి వైపుకు వస్తుండగా మేర్లపాక వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా భార్యాభర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
Sorry, no posts matched your criteria.