India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పవన్ గెలుపు కోసం పిఠాపురంలో మెగా హీరోలు వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 4న సాయిధరమ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేయనున్నట్లు జనసేన పార్టీ నేతలు తెలిపారు. 6వ తేదీన కాకినాడలో ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే 4 రోజుల కింద వరుణ్ తేజ్, నిన్న వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. మరో వైపు జబర్దస్త్ నటులు, డాన్స్ మాస్టర్ జానీ ఇక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
విజయనగరం పట్టణంలో కొత్తపేట వాటర్ ట్యాంక్ జంక్షన్ నుంచి గంటస్తంభం కూడలి వరకు నిర్వహించిన రోడ్ షోలో బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం గంటస్తంభం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ మేనిఫెస్టోను సూపర్ సిక్స్ పధకాలను ప్రజలకు తెలియజేశారు. విజయనగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థి పూసపాటి అధితి గజపతిరాజును పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని కోరారు.
తవణంపల్లె మండలంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు నేల కూలాయి. చిత్తూరు-అరగొండ హైవేపై ముత్తరపల్లె క్రాస్ వద్ద భారీ చింతచెట్టు రోడ్డుపై అడ్డంగా కూలిపోయింది. దీంతో పలు విద్యుత్ స్తంభాలు నెలకొరిగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి జిల్లాకు విచ్చేసిన సాయుధ బలగాల అధికారులతో, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖతో సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధులలో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని తెలిపారు.
రైలు కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదోని మండలం ఇస్వీ-కుప్పగల్ ఆర్ఎస్ కి.మీ 508/08 డౌన్ లైన్ ట్రాక్ వద్ద జరిగింది. గురువారం రైల్వే ఎస్ఐ కే.గోపాల్ తెలిపిన వివరాల మేరకు.. కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన ఆదోని తిక్కయ్య అనే వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేశామన్నారు.
విశాఖ ఆనందపురంలో చెక్ పోస్టు వద్ద భారీగా నకీలి కరెన్సీని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో చేపట్టిన దాడులలో 3 వాహనాలు, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 22 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 6 కత్తులు, రూ.10 లక్షల నకిలీ కరెన్సీ, ఒక రైస్ పూలింగ్ బౌల్, గోల్డ్ కోటెడ్ కాయిన్స్, బిస్కెట్‌లు పోలీసులు సీజ్ చేశారు.
మైదుకూరులో నిన్న సీఎం జగన్ సిద్ధం సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వెళ్లాడే కారణంతో ఖాదరపల్లెకు చెందిన యాపరాలపల్లె జాఫర్‌ను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు వివరాల మేరకు జాఫర్ మంగళవారం సీఎం జగన్ సభకు హాజరయ్యారు. దీంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ వ్యక్తులు ఫకృద్దిన్, లాల్ బాషాలు మెడపై కత్తి ఉంచి సభకు ఎందుకు వెళ్లావని బెదిరించి కాలు విరిచారని తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. సూరిశెట్టి రాజు(48) మడుపల్లి గ్రామానికి సొసైటీ మెంబర్‌గా పని చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గురువారం పనికి వెళ్లాడు. గుండెపోటు రాగా.. అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు మృతితో మడుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సెల్ఫ్ సపోర్ట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మే 5వ తేదీన నిర్వహిస్తునట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డీఏ నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 11:30 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలన్నారు.
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి సేవలు ఆన్ లైన్ లో చేసుకునే అవకాశం కల్పించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, అదనపు అర్హతలు నమోదు మొదలైన సేవలు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చని ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయాధికారి శ్రీనివాసులు గురువారం పేర్కొన్నారు. అభ్యర్థులు https://www.employment.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ SMS ద్వారా పంపడం జరుగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.