Andhra Pradesh

News May 2, 2024

వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలేటివారిపాలెం మండలం పోకూరుకి చెందిన జడ రవీంద్ర మృతి చెందాడు. గ్రామానికి చెందిన రవీంద్ర హైదరాబాదులోని ఓ కంపెనీకి చెందిన బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం మోటర్ బైక్ పైన హైదరాబాద్ నుంచి పోకూరు బయలుదేరిన రవీంద్ర చిట్యాల సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి బంధువులకు సమాచారం అందించారు.

News May 2, 2024

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు జిల్లా ఎస్పీK.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా బిట్రగుంట పరిధిలో-80, జలదంకి-45, దగదర్తి-41, మనుబోలు-15 & FJ Wash-1600 లీటర్లు, SEB-219 మద్యం బాటిల్స్ లను సీజ్ చేసామన్నారు. 

News May 2, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోనీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలోని నిడిమామిడి, రాచువారి పల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా గ్రామాలలో గత ఎన్నికలలో తలెత్తిన ఘటనలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా వేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News May 2, 2024

ఆదోనిలో స్వల్పంగా తగ్గిన పత్తి ధర

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7,587 పలికింది. మంగళవారంతో పోలిస్తే ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,711, వేరుశనగ గరిష్ఠ ధర రూ.7,311, కనిష్ఠ ధర రూ.3,819 పలికింది. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,400, కనిష్ఠ ధర రూ.4,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News May 2, 2024

పల్నాడు: అనుమతులు లేని మద్యం స్వాధీనం

image

అనుమతులు లేని మద్యం బాటిల్లను పల్నాడు జిల్లా ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాజుపాలెం మండలం కొండమూడు గ్రామానికి చెందిన ఓ మద్యం షాపులో అనుమతులు లేకుండా రవాణాకు సిద్ధంగా ఉంచిన, మద్యం బాటిల్లను అధికారులు గుర్తించారు. మొత్తం వెయ్యికి పైగా మద్యం బాటిల్ను గుర్తించినట్లు, వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

గిద్దలూరు బస్టాండ్‌లో తప్పిన పెను ప్రమాదం

image

గిద్దలూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి పోరుమామిళ్ల వెళ్లే బస్సుకి బ్రేకులు ఫెయిల్ అవడంతో బస్టాండ్‌లోని ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చింది. దీంతో బస్టాండులోని ఫిల్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News May 2, 2024

తూ.గో: ‘ఓటుతో ప్రభుత్వాన్నే కూల్చిన ఎమ్మెల్యే’ (REWIND) 

image

తూ.గో జిల్లాకు చెందిన ఓ MLA వేసిన ఓటు ప్రభుత్వాన్నే కూల్చేసింది. 1953లో ఆంధ్రా తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు సారథ్యంలో మద్యపాన నిషేధానికి బిల్లుపై ఓటింగ్ పెట్టారు. అయితే.. మద్యం తాగడం గిరిజనుల సంప్రదాయమంటూ ఎల్లవరం నియోజకవర్గ MLA కారం బాపన్నదొర బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడంతో అది వీగిపోయింది. మద్యపానాన్ని నిషేధించలేకపోయానన్న ఆవేదనతో ప్రకాశం పంతులు 14నెలలకే ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు.

News May 2, 2024

అనంత: నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడి మృతి 

image

గుంతకల్లు పట్టణ శివారు ప్రాంతంలోని బెస్ట్ కాలనీకి చెందిన జిశాంత్(4) నీటి సంపులో పడి మృతిచెందాడు. అక్క ఆయేషాతో కలిసి ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న తండ్రి మహబూబ్ అక్కడికి వెళ్లి సంపులో పడి ఉన్న బాలుడిని బయటకు తీయగా.. బాలుడు అప్పటికే మృతిచెందాడు.

News May 2, 2024

జగన్ సీఎం అయ్యాక నాపై దాడులు పెరిగాయి: మాజీ జడ్జి 

image

జగన్ సీఎం అయ్యాక నాపై దాడులు జరుగుతున్నాయని మాజీ జడ్జి రామకృష్ణ అన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్‌లో అయన మాట్లాడుతూ..ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిపై మార్చి 25న బీ కొత్తకోట స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సీఐ పట్టించులేదన్నారు. అందుకే నాఇంటిని ధ్వంసం చేయించారని, జడ్జి తమ్ముడే ఈదాడి చేశారని సీఐ ప్రకటన ఇవ్వడం సరికాదన్నారు. ఎలాంటి విచారణ చేయకుండా తప్పుడు దర్యాప్తు చేశారని  ఆరోపించారు.

News May 2, 2024

మార్కాపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

జిల్లాలో ఎండ తీవ్రత ఉద్ధృతంగా ఉంది. గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రతతో పాటు వేడిగాలులతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరయ్యారు. మార్కాపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా కనిగిరి, గిద్దలూరు, పామూరు తదితర మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో ఎండలు మరింత అధికంగా ఉన్నాయి. ఎండలు మూడు రోజుల నుంచి పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.