Andhra Pradesh

News May 2, 2024

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ విద్యార్థుల ఎంపిక

image

రాష్ట్రస్థాయి రెస్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం మల్లికార్జునరావు గురువారం తెలిపారు. గత నెల 28వ తేదీన నరసరావుపేటలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు పాల్గొన్నారు. ఈనెల 3, 4 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, పీఈటీ సునీల్‌ను హెచ్ఎం, గ్రామ పెద్దలు అభినందించారు.

News May 2, 2024

చీరాలలో సినీ హీరో ఎన్నికల ప్రచారం

image

చంద్రబాబు వస్తేనే జాబు వస్తుందని సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. చీరాల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్‌కు మద్దతుగా చీరాల పట్టణంలోని జానకి సెంటర్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే టీడీపీ ప్రభుత్వం లభించే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ని చూడటానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.

News May 2, 2024

ఏ కొండూరులో రోడ్డు ప్రమాదం.. పోస్ట్ మాన్ మృతి

image

గంపలగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి కృష్ణ దాస్ (55)గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విజయవాడ నుంచి ద్విచక్ర వాహనంపై గంపలగూడెం వస్తుండగా, చీమలపాడు వద్ద ఎదురుగా వస్తున్న గేదెలు కలబడి మీద పడినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అతనిని విజయవాడ ఆస్పత్రి తరలించగా మృతి చెందాడు. ఎస్సై చల్లా శ్రీనివాస్ ఘటనపై విచారణ చేపట్టారు.  

News May 2, 2024

కడప: పింఛను డబ్బు కోసం వెళ్లి వృద్ధుడు మృతి

image

పింఛను డబ్బు కోసం వెళ్లి వృద్ధుడు మృత్యువాత పడిన ఘటన రాయచోటిలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారంలో పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు రాయచోటిలోని ఓ బ్యాంకుకు పింఛన్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లారు. ఎండకు వెళ్లడంతో వడదెబ్బతో వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News May 2, 2024

ఏలూరు: డివైడర్‌ను ఢీకొన్న బస్సు

image

ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చింతలపూడి టౌన్ బోయగూడెం వద్ద గురువారం ప్రమాదానికి గురైంది. సత్తుపల్లి వయా సీతానగరం మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు బోయగూడెం వే బ్రిడ్జ్ ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని.. డ్రైవర్ వైపు బస్సు భాగం పాక్షికంగా దెబ్బతిందని డ్రైవర్ తెలిపారు.

News May 2, 2024

కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్‌కు 1972 మంది

image

నేటి నుంచి ప్రారంభం కానున్న హోమ్ ఓటింగ్ కోసం కృష్ణాజిల్లాలో 1972 మంది వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యధికంగా 409 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా పెడనలో 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుడివాడలో 166, పెనమలూరులో 373, పామర్రులో 228, మచిలీపట్నంలో 194, గన్నవరంలో 272 మంది దరఖాస్తు చేసుకోగా ఈ నెల 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ నిర్వహించనున్నారు.

News May 2, 2024

విశాఖలో ఐదుచోట్ల గాజు గ్లాస్ గుర్తు

image

విశాఖ జిల్లా పరిధిలో గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై స్పష్టత వచ్చింది. విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించలేదు. అయితే విశాఖ తూర్పు, ఉత్తరం, భీమిలి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. తూర్పు, ఉత్తర నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వడ్డీ శ్రావణి అనే స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించారు.

News May 2, 2024

ప.గో జిల్లాలో 845 మంది అరెస్ట్

image

పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో జనవరి 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 887 కేసులు నమోదు చేశామని జిల్లా మధ్య నిషేధ అబ్కారీ అధికారి ఆర్.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.41.66 లక్షలు విలువచేసే 13, 225 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే 845 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఎన్నికల తరుణంలో జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.

News May 2, 2024

కిటకిటలాడుతున్న బ్యాంకు సేవా కేంద్రాలు

image

సామాజిక పింఛన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈక్రమంలో నగదును డ్రా చేసుకునేందుకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బ్యాంకులతో పాటు బ్యాంకు సేవా కేంద్రాలు, మినీ ఏటీఎంల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. మరోవైపు దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

News May 2, 2024

కృష్ణా జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్ ప్రక్రియ

image

జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోమ్ ఓటింగ్ బృందాలు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓటు నమోదు చేయించుకుంటున్నారు. పెడనలో జరుగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా పరిశీలించారు. జిల్లాలో మొత్తం 1762 మంది హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.