India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర యూనివర్సిటీ 2024-25 విద్యాసంవత్సరానికి లాజిస్టిక్స్ ఎంబీఏ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆంధ్ర యూనివర్సిటీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్‌తో కలిపి ఈ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందిస్తోంది. లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనెజ్మెంట్‌లో రెండేళ్ల కోర్సును అందిస్తోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. జూన్ 18 చివర తేదీ.
ధర్మవరం పట్టణానికి ఇవాళ ప్రముఖ హీరోయిన్ నమిత విచ్చేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొననున్నారు. ధర్మవరం పట్టణంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
2024 ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా అభివృద్ధిపై ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లామని TDP అభ్యర్థులు.. తమ ప్రభుత్వ హయాంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయడం, వేలల్లో ఇళ్ల స్థలాలతో పాటు జిల్లా ముఖచిత్రాన్ని మార్చామంటూ YCP అభ్యర్థులు అంటున్నారు. మరి ఎవరి హయాంలో ప్రకాశం అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై సి.విజిల్ యాప్ ద్వారా 592 ఫిర్యాదులు అందాయని సి.విజిల్ యాప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 100 నిమిషాల లోపు 436 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 118 ఫిర్యాదులు ఎన్నికలకు సంబంధించినవి కావని చెప్పారు. 38 ఫిర్యాదులను వంద నిమిషాలు తర్వాత పరిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘానికి 44 ఫిర్యాదులు అందగా 33 పరిష్కరించామన్నారు.
మద్యం రవాణా, అక్రమ విక్రయాలను అడ్డుకుని ఎక్సైజ్ కేసులు తగ్గించడానికి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారిణి షేక్ ఆయేషా బేగం తెలిపారు. సీఐ సుధాకర్ 95736 32427, కానిస్టేబుల్ కుమార్ జాన్సన్ 89191 60437, జూనియర్ సహాయకులు శ్రీనివాస యాదవ్ 93986 74616లు అందుబాటులో ఉంటారన్నారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.
2024 ఎన్నికల నేపథ్యంలో కడప అభివృద్ధిపై ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కడప జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లామని కూటమి అభ్యర్థులు.. తమ ప్రభుత్వ హయాంలో జిల్లాకు రెండు కంపెనీలు, కడపలో సర్కిల్స్, ఒక మెడికల్ కాలేజ్, ఇలా కడప జిల్లా ముఖచిత్రాన్ని మార్చామంటూ YCP అభ్యర్థులు అంటున్నారు. మరి ఎవరి హయాంలో కడప అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని దేవస్థాన ఈఓ పెద్దిరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దేవస్థానం చెక్‌పోస్టు వద్ద ప్లాస్టిక్ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి రాకుండా తనిఖీలు చేపడుతామన్నారు. స్థానిక వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటు వేయాలి అనుకునేవారు తమ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సులభమైన విధానం ఏర్పాటు చేశారు. 1950 నెంబర్‌కు ఫోన్ చేసి ఓటరు పేరు, నియోజకవర్గంలో, ఓటర్ కార్డ్ నెంబరు చెబితే పోలింగ్ బూత్ వివరాలు అందిస్తున్నారు. అదేవిధంగా 0891-2590100కు ఫోన్ చేసినా సమాచారం అందిస్తారు. నిత్యం అందుబాటులో ఉండే ఈ కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవచ్చని విశాఖ అధికారులు తెలిపారు.
1952లో జరిగిన తొలి ఎన్నికల్లో విశాఖపట్నం 68,282 మంది ఓటర్లతో ఓకే అసెంబ్లీ స్థానంతో కలిగి ఉంది. నేడు విశాఖ 7 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఎదిగి నగరంలో 17 లక్షల మంది ఓటర్లు, జిల్లా వ్యాప్తంగా 20 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. విశాఖ నగరం తొలి ఎమ్మెల్యేగా తెన్నేటి విశ్వనాథం ఎన్నికయ్యారు. పునర్విభజన అనంతరం విశాఖ తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ, గాజువాక, భీమిలి, పెందుర్తి నియోజకవర్గాలు వెలశాయి.
పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మే 5న నెల్లూరుకు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కోవూరు పట్టణంలో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు తరలిరావాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.