Andhra Pradesh

News May 2, 2024

బద్వేల్ ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు: షర్మిల

image

బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధాపై వైఎస్ షర్మిల ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. బద్వేల్ ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు కదన్నా.. గెలిచాక ఎప్పుడైనా చూశారా.. అంతా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చూసుకుండంటా.. కొండలు, గుట్టలు ఏదీ వదిలిపెట్టడం లేదంటకదా’ అని విమర్శనాస్త్రాలు గుప్పించారు. షర్మిల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం.

News May 2, 2024

ఒంగోలు: డివైడర్‌ను ఢీ కొట్టిన రాయపాటి అరుణ కారు

image

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించి ఒంగోలు వస్తుండగా కొరిసపాడు మండలంలోని రేణింగవరం వద్ద కారు టైర్ పగిలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News May 2, 2024

చిత్తూరు: మూడో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు

image

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మూడో తరగతి(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు 20వ తేదీలోగా సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకోవాలని.. వివరాలకు 9490957021లో సంప్రదించాలని కోరారు.

News May 2, 2024

విజయనగరం: ఈనెల 15 నుంచి వేసవి క్రీడా శిబిరాలు

image

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహించాలనుకున్న వేసవి శిక్షణ శిబిరాలను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ శిబిరాలు వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయసు గల బాల, బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News May 2, 2024

ఈ నెల 4న గుడివాడలో పవన్ కళ్యాణ్ స్ట్రీట్ మీటింగ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాముల విజయాన్ని కాంక్షిస్తూ గుడివాడలో స్ట్రీట్ మీటింగ్ పేరుతో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. NTR స్టేడియం నుంచి నెహ్రూ చౌక్ వరకు రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News May 2, 2024

విశాఖ: కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కుమార్తె మృతి

image

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుమార్తె మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో పీఎం పాలెంలో నివాసం ఉంటున్నారు. కుమార్తె ప్రవర్తన నచ్చక తీవ్రమనస్తాపం గురై ఎలుకల మందు తాగారు. ఇది చూసి చిన్నారులు సైతం ఎలుకల మందు తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది.

News May 2, 2024

గోపాలపురం: రూ.2.40 కోట్లు సీజ్

image

గోపాలపురం సరిహద్దుల్లో భారీగా నగదు పట్టుబడింది. జగన్నాధపురం చెక్‌పోస్ట్ వద్ద రూ. 2.40 కోట్లు తరలిస్తుండగా పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ బస్సులో ఆ నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపుగా ఆ బస్సు వెళ్తున్నట్లు సమాచారం.

News May 2, 2024

నేడు పాలకొండలో పవన్ పర్యటన

image

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం పాలకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజుపేట జంక్షన్ వద్ద హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుంచి తన కాన్వాయ్‌లో ప్రచారం చేస్తూ పాలకొండలోని వడమ సెంటర్ చేరుకుంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్‌లో పిఠాపురం బయలుదేరనున్నారు. 

News May 2, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి వేట నిషేధ భృతి లబ్ధిదారుల ఎన్యూమరేషన్

image

జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో వేట నిషేధకాలానికి భృతి అందించేందుకు అర్హుల గుర్తింపు కోసం గురువారం నుంచి ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టనున్నామని జిల్లా మత్స్యశాఖాధికారి పీవీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈసీ అనుమతితో ఈ సర్వేలో అధికారులే స్వయంగా మండలాల్లో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ.10 వేల నగదును ఆర్థిక సాయంగా అందజేస్తుందని ప్రకటించారు.

News May 2, 2024

డీఎడ్ ఫీజులు చెల్లించండి: డీఈఓ

image

NLR: డీఎడ్ విద్యార్థులు నాలుగో సెమిస్టర్ ఫీజులను మే 8వ తేదీ లోపు చెల్లించాలని నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు సూచించారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 15వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. రెగ్యులర్‌తో పాటు ప్రైవేటు విద్యార్థులు పూర్తి వివరాల కోసం సంబధిత కళాశాలల్లో సంప్రదించాలని డీఈఓ కోరారు.