India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సారవకోట మండలంలోని 24 మంది సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీవో రాంబాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండలంలో 8,420 మంది సామాజిక భద్రత పింఛనుదారులు ఉండగా వీరికి పింఛను మొత్తాలు అందించడానికి 181 మంది సచివాలయ ఉద్యోగులను నియమించారు. ఈనెల 1న ఉదయం 5:30 గంటల నుంచి పింఛను మొత్తాలు అందించాలని సూచించినప్పటికీ 24 మంది ఉదయం 6:30 గంటల వరకు లాగిన్ కాకపోవడంతో చర్యలు తీసుకున్నామన్నారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల బదిలీలలో కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు తిరిగి సొంత జిల్లాకు వచ్చారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తహశీల్దార్లకు ఆయా మండలాల వారీగా స్థానాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వారికి కేటాయించిన స్థానాలలో జాయిన్ కావాలని సూచించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి చేరుకుని నాయకుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ మేరకు బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

విశాఖ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందేందుకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక జరుగుతుందన్నారు. అర్హులైన వారు ఈ నెల 5వ తేదీ లోపు దరఖాస్తులను డీఈఓ కార్యాలయానికి అందజేయాలని కోరారు.

జిల్లాలోని 40 మంది తహశీల్దార్లకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పొరుగు జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు ఇటీవల కలెక్టరేట్లో పోస్టింగ్ నిమిత్తం రిపోర్టు చేశారు. వారితోపాటు, స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కొందరికి స్థానచలనం కల్పిం చారు. కొండపి, సింగరాయకొండ, జరుగుమల్లి, ఒంగోలు డీఏవో తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పెన్షన్ల పంపిణీనీలో అలసత్వం వహించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో సచివాలయ సిబ్బంది ఉదయం 8 గంటల వరకు పింఛన్లు పంపిణీ ప్రారంభించలేదనే ఆరోపణతో, పెన్షన్ల పంపిణీ ఆలస్యంపై కారణం తెలపాలంటూ ఆయా మండలాల MPDOలకు ZP సీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలో మొత్తంగా 166 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్ల ఆలస్యంగా పంపిణీ చేసినట్లు నోటీసుల్లో పాల్గొన్నారు.

యూనియన్ బ్యాంకులో ఓ మహిళ దొంగతనానికి యత్నించిన ఘటన త్రిపురాంతకం మండలం మేడపి యూనియన్ బ్యాంకులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ మహిళ బ్యాంక్ షటర్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి లాకర్ తాళాలు రాకపోవడంతో వెనుదిరిగింది. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా బ్యాంకులో చోరీ చేసేందుకు ఓ మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చినట్లు దర్శి డీఎస్పీ అశోకవర్థన్ తెలిపారు.

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. నిన్న వంశీ అరెస్ట్ అయ్యారంటూ ప్రచారం సాగినప్పటికీ పోలీసులు ఖండించారు. వంశీ అమెరికాలో ఉన్నారా, ఇండియాలోనే ఉన్నారా అనే అంశంపై ఆయన సన్నిహితుల వద్ద సైతం సమాధానం లేదు. కాగా గన్నవరం TDP కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనలో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.

విశాఖ స్థానిక సంస్థల MLC YCP అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ ఖరారైంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా నేతలకే అవకాశం కల్పిస్తుంటారు. కానీ, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స పేరును జగన్ ప్రకటించడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. బొత్స సతీమణి ఝాన్సీ ఇటీవల విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా, నేడు బొత్సకు అవకాశం దక్కింది. దీంతో బొత్స అనుచర వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.

ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రోడ్డు ప్రమాదాలలో 21 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కేసులు 30 నమోదవ్వగా .. 24 మంది గాయపడ్డారన్నారు. వీరిలోనూ 30 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారని ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించలేదని వివరించారు. ఒక వేళ హెల్మెట్ పెట్టుకుని ఉంటే బ్రతికేవారేమోనని అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.