India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆన్‌లైన్‌లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అమలాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద అంబికా లాడ్జిలో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి ఐదు లాప్టాప్‌లు, 75 మొబైల్ ఫోన్లు, చెక్ బుక్కులు, 25 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఆగస్టు 1వ తేదీన “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే 100% పెన్షన్ పంపిణీ చేసేలా.. అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విజయవాడ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఒకటో తేదీ 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏర్పాటైన ‘యాంటి నార్కోటిక్ సెల్’ బృందాలు మంగళవారం 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాయని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సెల్ ద్వారా ఇప్పటివరకు 77 మందిని అదుపులోకి తీసుకుని 28 కేసులు నమోదు చేసి 185 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా గంజాయి కట్టడికై విజయవాడ పోలీసుల చొరవను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు.

పోలవరం MLA చిర్రి బాలరాజుపై జరిగిన <<13739566>>దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ‘X’ వేదిక స్పందిస్తూ.. దోషులు ఎవరైనా సరే కఠిన శిక్షపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం అవ్వకుండా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు.

శ్రీశైలం డ్యామ్‌కు లైట్లు ఏర్పాటు చేయాలంటూ Way2Newsలో ప్రచురితమైన కథనానికి జలవనరుల శాఖ అధికారులు స్పందించారు. డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లకు మంగళవారం లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి వేళలో పాల నురగలాంటి కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తూ, జల్లులో తడుస్తూ సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. జలాశయం 7 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.

వాట్సాప్‌లకు వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల మొబైల్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. ఈ మేరకు వారు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి సైబర్ నేరాల బారిన పడవద్దన్నారు. ఏవైనా సైబర్ ఫిర్యాదులను 1930కు చేయాలని సూచించారు.

చిల్లకూరు మండలం ఓ గ్రామంలోని బాలికపై <<13737798>>వృద్ధుడు<<>> అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ గ్రామంలో ఓ విద్యార్థిని ఒకటో తరగతి చదువుతోంది. ఇంటర్వెల్ సమయంలో బడి బయటకు వచ్చిన పాపను 70 ఏళ్ల వృద్ధుడు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పొక్సో కేసు నమోదు చేశారు.

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని మినీ సమావేశమందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు.

నక్కపల్లి మండలం APIIC నిర్వాసితుల సమస్యలపై విశాఖ సర్క్యూట్ హౌస్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ఏడు గ్రామాల రైతులు, ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. త్వరలోనే ఏపిఐఐసీ నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని మంత్రి కలెక్టర్ విజయకృష్ణన్, అధికారులను ఆదేశించారు.

కడప జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర హోం మంత్రి అనిత సూచించారు. వైజాగ్ నుంచి హోంమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కడప ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు, గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.