Andhra Pradesh

News May 1, 2024

తూ. గో: అత్యంత పారదర్శకంగా ఈవీఎమ్ ర్యాండమైజేషన్

image

తూ.గో జిల్లాలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీలో నిలిచిన అభ్యర్థుల, వారి ప్రతినిధుల సమక్షంలో “ఈవీఎం- ర్యాండమైజేషన్” ప్రక్రియను సజావుగా చేపట్టడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజమండ్రి పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలలో అత్యంత పారదర్శకంగా ఈవీఎమ్‌ల ర్యాండమైజేషన్ ఆయా అభ్యర్థుల సమక్షంలో నిర్వహించారు.

News May 1, 2024

పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన DMHO

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డా.కే.విజయపార్వతీ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వహించిన డా.బగాది జగన్నాథరావు మంగళవారం పదవీ విరమణ చేసిన సంగతి అందరికీ విదితమే.

News May 1, 2024

చింతపల్లిలో రూ.5.5కోట్ల లిక్విడ్ గంజాయి స్వాధీనం

image

చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో 52 కేజీలు గంజాయి లిక్విడ్‌ను స్వాధీనం చేసుకొని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని, తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.5.5 కోట్లు ఉంటుందని, వేరే రాష్ట్రాలలో విలువ మరింత ఎక్కువ ఉంటుందన్నారు.

News May 1, 2024

ప.గో. జిల్లాలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి

image

ప.గో. జిల్లా ఇరగవరం మండల కేంద్రంలో విషాదం జరిగింది. మండలంలోని గోటేరు గ్రామానికి చెందిన రెడ్డిమిల్లి రక్షిత రాజు (8), మురాల మహి కలువ పువ్వులు కోసేందుకని స్థానిక చెరువులో దిగారు. ఈ క్రమంలో రక్షిత రాజు గల్లంతయ్యాడు. స్థానికులు విషయం తెలుసుకొని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.

News May 1, 2024

నంద్యాల జిల్లాలో 20,509 మందికి హోం ఓటింగ్ అవకాశం

image

హోం ప్రక్రియ ఓటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సుమారు 15,509 మంది దివ్యాంగులు, 5వేల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు వెల్లడించారు. వారికి ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద ఓటు హక్కు కల్పించిన నేపథ్యంలో హోం ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 45మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించామన్నారు.

News May 1, 2024

శ్రీకాకుళం: ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలపై ఆరా తీశారు.

News May 1, 2024

ద్వారకాతిరుమలలో రేపు పురంధీశ్వరి పర్యటన 

image

BJP రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధీశ్వరి గురువారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్నారు.  ఉదయం 7 గంటలకు మారంపల్లిలో యాత్ర ప్రారంభమై గున్నంపల్లి మీదుగా కప్పలగుంట చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్లజర్ల మండలంలోని గంటావారిగూడెం, దూబచెర్ల , నల్లజర్ల మీదుగా రాత్రి 9 గంటలకు పోతవరం చేరుకోనున్నారు.

News May 1, 2024

పిఠాపురం: దుష్ప్రచారంపై ఫిర్యాదు చేస్తా: దొరబాబు

image

సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న దుష్పచారంపై సైబర్ పోలీసులకు  ఫిర్యాదు చేస్తానని పిఠాపురం MLA పెండెం దొరబాబు మంగళవారం తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరుతున్నానంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిందన్నారు. అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలని ఖండించారు. తాను వైసీపీలోనే ఉంటానని చెప్పారు.

News May 1, 2024

గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి బాధ్యత లోకేశ్‌ది: బ్రాహ్మణి

image

డ్వాక్రా పేరు చెబితే CBN ఎలా గుర్తుకు వస్తారో స్త్రీ శక్తి పేరు చెబితే లోకేశ్ అలా గుర్తుకొస్తున్నారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళవారం సాయంత్రం దుగ్గిరాల మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. లోకేశ్‌ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి.. నియోజకవర్గం అభివృద్ధి లోకేశ్ బాధ్యతని బ్రాహ్మణి చెప్పారు. పసుపు మిల్లును సందర్శించి పసుపు కొమ్ముల నుంచి పసుపును ఎలా తయారు చేస్తారో కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

News May 1, 2024

నారా లోకేశ్‌తో వీపీఆర్ భేటీ

image

నెల్లూరు పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు స్థానంలో రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. వీపీఆర్ వెంట నెల్లూరు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు.