India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వస్తున్న బాలుడిని JCB ఢీకొగా ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ఈసీ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వారి నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే పోస్టల్‌బ్యాలెటు ఓట్లు వినియోగించుకోవాలని కలెక్టర్ హరి నారాయణన్ సూచించారు. మే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంటుకు, అసెంబ్లీకి రెండు ఓట్లు వేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చీరాలకు వస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడతారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు. తాజాగా బలరాం కుమారుడు వెంకటేశ్ చీరాల నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో బలరాం, వెంకటేశ్‌పై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మూడో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాణి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో HMలకు నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. మే 30న లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కర్నూలు స్వతంత్ర అభ్యర్థి ఎస్.ఇంతియాజ్ బాష ఆరోపించారు. రాత్రి 12 గంటల సమయంలో వైసీపీకి చెందిన ఇద్దరూ గరీబ్ నగర్‌లోని తన ఇంటికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారని అన్నారు. ఈ విషయమై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం బాధితుడు ఫిర్యాదు చేశారు.
రొద్దం మండలం పెద్దగువ్వలపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ముళ్లపొదలో అప్పుడే పుట్టిన మగ బిడ్డను వదిలి వెళ్లారు. ఈ ఘటన స్థానికులను కలిచివేస్తుంది. గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐసీడీఎస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
తెలుగు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బ భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. బంధువులతో కలిసి ఆలయానికి వచ్చిన వారు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాన్ని కప్పి సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.
గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్‌కు చెందిన గోళ్ళ రవికుమార్ అనే కానిస్టేబుల్ భీమవరం రైల్వే గేట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రాంగ్ రూట్‌లో పట్టణంలోకి ప్రవేశిస్తున్న లారీని కానిస్టేబుల్ నిలువరించగా.. లారీలో ఉన్న బిహార్‌కు చెందిన క్లీనర్ బిశ్వాస్ రాయి తీసుకుని కానిస్టేబుల్ తలపై కొట్టడంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుణ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
కడప పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రెకెత్తిస్తున్నాయి. ఎంపీ అవినాశ్ రెడ్డిపై ప్రధానంగా షర్మిల, భూపేష్ రెడ్డి బరిలో నిలిచారు. విమర్శలతో ప్రచారాలు వాడి వేడిగా సాగుతున్నాయి. దీంతో కడప ఎంపీగా గెలిచేది ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. జగన్‌పై వ్యతిరేక ఓటును షర్మిల చీల్చే అవకాశం ఉందని జిల్లా నేతలు చర్చించు కుంటున్నారు. దీంతో కడపలో ఈ సారి త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
ఉమ్మడి విశాఖలో నేడు జనసేన, వైసీపీ అధినేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సీఎం జగన్ పాయకరావుపేటలోని సూర్యా మహాల్ సెంటర్‌లో సాయంత్రం 3 గంటలకు జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ నేపథ్యంలో జనసమీకరణపై ఆయా పార్టీల నాయకులు దృష్టి పెట్టారు.
Sorry, no posts matched your criteria.